అక్షరటుడే వెబ్‌డెస్క్: Rashmika Injury | ప్రముఖ నటి, నేషనల్ క్రష్ రష్మిక మందన్న షూటింగ్ సెట్‌లో గాయపడ్డారు. ఓ సినిమాలోని హై-ఎనర్జీ డాన్స్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా కాలు జారి కిందపడటంతో ఆమె తుంటి (హిప్) భాగానికి బలమైన గాయమైనట్టు సమాచారం. వెంటనే అప్రమత్తమైన చిత్ర యూనిట్ ఆమెను ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించింది. పరీక్షించిన వైద్యులు.. గాయం తీవ్రత దృష్ట్యా ఆమెకు కనీసం ఆరు వారాల పాటు పూర్తి విశ్రాంతి (బెడ్ రెస్ట్) అవసరమని సూచించారు. దీంతో ఆమె కొద్ది రోజులు సినిమాలకు దూరంగా ఉండనున్నారు. రష్మిక త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కాగా, ప్రస్తుతం ఆమె విజయ్ దేవరకొండ సరసన ‘రౌడీ జనార్దన్’ చిత్రంలో నటిస్తున్నారు.
షూటింగ్లో నటి రష్మికకు గాయాలు
షూటింగ్లో నటి రష్మికకు గాయాలయ్యాయి. డాన్స్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా నడుము భాగంలో గాయం అయ్యింది. ఆరు వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం.
Rashmika Injured During Film Shooting
Actress Rashmika was injured while… pic.twitter.com/8eKd4SLT1m
— Akshara Today | Telugu News (@aksharatoday) July 31, 2026
ఇది కూడా చదవండి: Cauvery Dispute | ముదురుతున్న కావేరి జలవివాదం.. తమిళనాడు సీఎంతో చర్చలు రద్దు