అక్షరటుడే వెబ్‌డెస్క్: Rajendra Prasad Padma Shri | టాలీవుడ్ సీనియర్ నటుడు, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘పద్మశ్రీ’ అవార్డును అందించిన సంగతి తెలిసిందే. అయితే ఈ అవార్డుల ప్రదానోత్సవ వేళ మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. తాజాగా ఈ వివాదంపై స్పందించిన రాజేంద్ర ప్రసాద్, చిరంజీవి వ్యాఖ్యలను నెగిటివ్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని, అనవసర వివాదాలకు దూరంగా ఉండటం మంచిదని సూచించారు.
Rajendra Prasad Padma Shri | చిరంజీవి వ్యాఖ్యలపై స్పష్టత..
పద్మశ్రీ అవార్డు వేదికపై చిరంజీవి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో రాజేంద్ర ప్రసాద్ స్పందించారు. “చిరంజీవి ఏ సందర్భంలో, ఏ మూడ్‌లో ఆ మాట అన్నారో నాకు తెలియదు. ప్రతి విషయాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం సరికాదు” అని ఆయన అన్నారు. చిరంజీవికి ఇప్పటికే ఎన్నో గౌరవప్రదమైన అవార్డులు వచ్చాయని, దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న వ్యక్తుల్లో ఆయన ఒకరని చిరంజీవిని కొనియాడారు. తాను చిరంజీవిని సమర్థించడం లేదని, కానీ మాటలకు తప్పుడు అర్థాలు వెతికే ధోరణిని మార్చుకోవాలని ఆయన హితవు పలికారు.
Rajendra Prasad Padma Shri | అవార్డు అడిగి తీసుకోవడం భిక్ష..
ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ అవార్డుల విషయంలో తనదైన శైలిలో అభిప్రాయాలను పంచుకున్నారు. “అవార్డులను మనం అడిగి తీసుకుంటే అది భిక్ష వంటిది. మన ప్రతిభను గుర్తించి, వాళ్లే పిలిచి ఇస్తే అది నిజమైన గౌరవం” అని ఆయన పేర్కొన్నారు. సినిమా అవార్డుల విషయంలో ఉత్తరాది, దక్షిణాది నటుల మధ్య వివక్ష ఉందనే చర్చ ఎప్పటి నుంచో ఉందని, అది నిజమేనని ఆయన అభిప్రాయపడ్డారు.
Rajendra Prasad Padma Shri | థంబ్ నైల్స్ పెట్టి వివాదం..
కొందరు మీడియా ప్రతినిధులు తన వ్యాఖ్యలను వక్రీకరించారని రాజేంద్ర ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. “తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత, నాకు పద్మశ్రీ రావడం దేవుని కృప అని, నాకు అంత సీన్ లేదు (అర్హత లేదని కాదు, దేవుని దయ గొప్పదని) సరదాగా అన్నాను. కానీ కొందరు మీడియా వాళ్లు ‘రాజేంద్ర ప్రసాద్‌కు అంత సీన్ లేదు’ అని థంబ్ నైల్స్ పెట్టి వివాదం సృష్టించారు” అని ఆయన వివరించారు. చిన్న చిన్న వివాదాలను విన్నప్పుడు వాటిని అక్కడే వదిలేయడం మంచిదని, కళాకారులుగా మనం మన పనిపైనే దృష్టి పెట్టాలని రాజేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు.
#RagalahariNews : 🚨 “అడిగి తీసుకుంటే అవార్డు భిక్ష అవుతుంది!” – పద్మశ్రీ రాజేంద్ర ప్రసాద్ సెన్సేషనల్ కామెంట్స్!
అవార్డులపై చిరంజీవి చేసిన కామెంట్స్ పై రియాక్ట్ అయిన ‘నటకిరీటి’. “నేను చిరంజీవిని సపోర్ట్ చేయడం లేదు. బట్ ఆయన ఏ సందర్భంలో అన్నారో తెలియకుండా ప్రతిదాన్ని తప్పుగా… pic.twitter.com/ISLDuKJZk9
— Ragalahari (@Ragalahariteam) July 7, 2026
ఇది కూడా చదవండి: Iran Attack on Ship | వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి