Iran Attack on Ship | వాణిజ్య నౌకపై ఇరాన్​ దాడి

హర్ముజ్ జలసంధి మీదుగా ప్రయాణిస్తున్న మరో నౌకపై ఇరాన్ దాడి చేసింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Iran Attack on Ship | హర్ముజ్ జలసంధి (Strait of Hormuz) మీదుగా ప్రయాణిస్తున్న మరో నౌకపై ఇరాన్ దాడి చేసింది. ఒమన్‌లోని లిమాకు తూర్పున ప్రయాణిస్తున్న ఒక ట్యాంకర్‌ దాడి చేయడంతో మంటలు చెలరేగాయి. నౌకలపై ఇరాన్ కనీసం 2 క్షిపణులను ప్రయోగించిందని తెలుస్తోంది.

Iran Attack on Ship | ఆయిల్​ ట్యాంకర్​పై దాడి

అమెరికా – ఇరాన్​ పీస్​ డీల్​కు అంగీకరించడంతో పశ్చిమాసియాలో ఇప్పుడిప్పుడే శాంతి నెలకొంటుంది. హర్ముజ్​ మీదుగా నౌకల రాకపోకలు పెరిగాయి. దీంతో ముడి చమురు ధరలు భారీగా దిగిచ్చాయి. ఈ క్రమంలో తాజాగా ఆయిల్​ ట్యాంకర్​పై దాడి జరగడం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం తెల్లవారుజామున నౌకపై క్షిపణి దాడి జరిగినట్లు తెలుస్తోంది.

Iran Attack on Ship | ఇతర నౌకలపై సైతం

హెచ్చరికలను నిర్లక్ష్యం చేసినందుకే ద్రవీకృత సహజ వాయువు ట్యాంకర్‌పై దాడి జరిగిందని ఇరాన్ టెలివిజన్ తెలిపింది, కానీ టెహ్రాన్ ఈ దాడికి నేరుగా బాధ్యత వహించలేదు. హర్ముజ్ జలసంధి మీదుగా తాము ఆమోదించిన మార్గం మాత్రమే సురక్షితమని టెహ్రాన్ ప్రకటించింది. ఒమన్ తీరానికి సమీపంలో ఉన్న మరో మార్గాన్ని ఉపయోగించిన ఇతర నౌకలపై కూడా ఇదే దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. ఒమన్‌లోని లిమా సమీపంలో ట్యాంకర్‌పై దాడి జరిగిందని యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ కేంద్రం తెలిపింది. ఆ నౌక జలసంధి నుంచి దక్షిణంగా ఒమన్ గల్ఫ్ వైపు ప్రయాణించడానికి ప్రయత్నిస్తుండగా క్షిపణి దాడి జరిగిందని పేర్కొంది.

ఇది కూడా చదవండి..: Russia Ukraine War | కీవ్‌పై రష్యా భారీ క్షిపణి దాడులు.. 11 మంది మృతి!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *