అక్షరటుడే, వెబ్‌డెస్క్: Varanasi Movie | మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ మూవీలో మహేశ్ రుద్రగా నటిస్తున్నారు. మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ రుద్ర (Rudra) ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది.
వారణాసి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మహేశ్ నటించిన గుంటూరు కారం అంచనాలు అందుకోలేపోయింది. ఈ క్రమంలో ఆయన తాజా చిత్రంపై ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. అంతేగాకుండా రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ తొలిసారి నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కానుంది. ఈ సినిమాలో రుద్ర, శ్రీరాముడిగా మహేశ్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నారు. ఈ క్రమంలో రుద్ర ఫస్ట్ లుక్‌ను రాజమౌళి మహేశ్ బర్త్‌డే సందర్భంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Varanasi Movie | రుద్ర ప్రపంచం నుంచి..
రుద్ర ప్రపంచం నుంచి చిన్న సర్‌ప్రైజ్ అంటూ మహేశ్ ఈ ఫొటోలను ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. చిత్రనిర్మాణ సంస్థ దుర్గా ఆర్ట్స్ సైతం మహేశ్‌కు విషెస్ తెలిపింది. ఈ చిత్రాలను పోస్ట్ చేసిన రాజమౌళి రౌద్రం అంటే అతడి స్వభావం కాదు అనే క్యాప్షన్ పెట్టారు. ఈ మూవీ ప్రపంచంతో పాటు కాలాల్ని చుట్టేసే కథతో తెరకెక్కుతున్నట్లు తెలిసింది.
దీనిని కూడా చదవండి : Nashik Earthquake | మహారాష్ట్రలో భూకంపం.. గోడలకు పగుళ్లు