అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Nizamabad Rural Police | నగరంలోని (Nizamabad) రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో వ్యభిచార గృహంపై పోలీసులు మెరుపుదాడి చేశారు. ఈ క్రమంలో పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
Nizamabad Rural Police | హౌసింగ్ బోర్డు కాలనీలో..
నిజామాబాద్ రూరల్ ఎస్హెచ్వో శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. రూరల్ పీఎస్ పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీలో గల ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతోందనే పక్కా సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఓ మహిళ, పురుషుడిని సైతం పట్టుకున్నారు. విచారణలో నిందితులు నాలుగు నెలలుగా అద్దె ఇంట్లో రహస్యంగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు, హైదరాబాద్‌కు చెందిన బ్రోకర్ ద్వారా మహిళలను ఇక్కడికి రప్పిస్తున్నట్లు తేలింది.
ఈ కేసులో ప్రధాన నిందితులు ఇద్దరితో పాటు విటుడిని అరెస్టు చేయగా, బాధిత మహిళను రక్షించి (Human Trafficking) సంబంధిత నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టారు. బాధిత మహిళను న్యాయమూర్తి ఎదుట హాజరు పర్చడం జరిగిందన్నారు. హైదరాబాద్‌కు చెందిన బ్రోకర్ ప్రస్తుతం పరారీలో ఉండగా, ఆమె కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఎస్హెచ్వో వివరించారు. వ్యభిచార గృహం నిర్వాహకులపై గతంలో నగరంలోని ఐదో టౌన్లో కూడా వ్యభిచారానికి సంబంధించిన కేసు నమోదైనట్లు నిందితులు ఒప్పుకున్నారు. ఈ మేరకు నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.