అక్షరటుడే వెబ్‌డెస్క్: Khamenei Funeral | అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ ( Khamenei) అంత్యక్రియలకు రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి చివరలో జరిగిన దాడుల్లో ఖమేనీ మరణించిన విషయం తెలిసిందే. సుదీర్ఘ విరామం తర్వాత, జులై 4 నుండి 9 వరకు ఈ అంత్యక్రియల కార్యక్రమాలను నిర్వహించేందుకు ఇరాన్ అధికారులు షెడ్యూల్ ఖరారు చేశారు.
Khamenei Funeral | భారత్ ప్రతినిధులుగా..
ఈ అంత్యక్రియలకు హాజరు కావాల్సిందిగా ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆహ్వానం పంపినట్లు వార్తలు వచ్చాయి. దీనికి ప్రతిస్పందనగా, భారత ప్రభుత్వం తరఫున కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గరిటా , బిహార్ గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్ హాజరుకానున్నట్లు ఇరాన్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, దీనిపై భారత ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Khamenei Funeral | అంత్యక్రియల షెడ్యూల్..
జులై 4న టెహ్రాన్‌లో అంత్యక్రియల కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. జులై 7న ఖోమ్ నగరంలో ప్రత్యేక ప్రార్థనలు ఉంటాయి. జులై 9న ఖమేనీ స్వస్థలమైన మషాద్‌లో ఆయనను ఖననం చేయనున్నారు. ఈ కార్యక్రమాలకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చే అవకాశం ఉందని, దాదాపు 2 కోట్ల మంది వరకు హాజరుకావచ్చని ఇరాన్ అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ దాడుల ఘటనలో ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా మరణించడం ఇరాన్‌లో తీవ్ర విషాదాన్ని నింపింది.
ఇది కూడా చదవండి: Bhagyaraj Funeral | వీడియోల పేరుతో సర్కస్.. నటి రాధికా తీవ్ర ఆగ్రహం