అక్షరటుడే వెబ్‌డెస్క్: Illegal Gender Tests |రంగారెడ్డి జిల్లా ( rangareddy ) వనస్థలిపురంలో అక్రమంగా శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న ముఠాను ఎస్‌వోటీ పోలీసులు ‘డెకాయ్ ఆపరేషన్’ ద్వారా ఛేదించారు. ఈ వ్యవహారంలో ప్రధాన పాత్ర పోషించిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Illegal Gender Tests | అక్రమ దందా..
పోలీసుల కథనం ప్రకారం.. హయగ్రీవ ఆస్పత్రి డైరెక్టర్ కొర్ర రాజు, అక్కడి రిసెప్షనిస్ట్ లోకేశ్, తుక్కుగూడలోని శ్రీ సాయి ధనుష్ క్లినిక్ ల్యాబ్ టెక్నీషియన్ విజయ్‌కుమార్ కలిసి ఈ అక్రమ దందాకు పాల్పడుతున్నారు. గర్భంలోని శిశువు ఆడో, మగో నిర్ధారించి చెబుతామంటూ ఆస్పత్రికి వచ్చే బాధితులను నమ్మిస్తున్నారు. ఆ తర్వాత, తమకు తెలిసిన వ్యక్తి ద్వారా స్కానింగ్ చేయిస్తామంటూ బాధితులను తుక్కుగూడలోని శ్రీ సాయి ధనుష్ క్లినిక్‌కు పంపిస్తున్నారు.
Illegal Gender Tests | పోలీసుల మెరుపు దాడి..
ఈ ముఠాపై నమ్మదగ్గ సమాచారం అందుకున్న పోలీసులు, డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి అసలు రంగును బయటపెట్టారు. నిందితులను అదుపులోకి తీసుకుని, శ్రీ సాయి ధనుష్ క్లినిక్‌పై దాడి చేశారు. నిందితులపై పీసీపీఎన్డీటీ (PCPNDT) చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు వనస్థలిపురం సీఐ రవిబాబు తెలిపారు. ఇలాంటి చట్టవిరుద్ధమైన పనులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
Illegal Gender Tests | స్థానికుల డిమాండ్..
ఈ దారుణానికి పాల్పడిన ఆస్పత్రులను సీజ్ చేయడంతో పాటు, బాధ్యులైన వైద్యుల లైసెన్స్‌లను రద్దు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కేవలం కేసులతో సరిపెట్టకుండా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇది కూడా చదవండి: Prakash Raj Dharmasthala | ధర్మస్థల వివాదం.. రిట్ పిటిషన్‌లో ప్రకాశ్‌రాజ్ పేరు
