నిజామాబాద్Handloom Society Elections | చేనేత సంఘాల ఎన్నికల సమరానికి సై.. తుది జాబితాలకు ఆమోదం

Handloom Society Elections | చేనేత సంఘాల ఎన్నికల సమరానికి సై.. తుది జాబితాలకు ఆమోదం

ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలోని చేనేత సహకార సంఘాల పాలకవర్గాల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. సంఘాల ఓటరు తుది జాబితాలను సహకార శాఖ అధికారులు సిద్ధం చేసి ఆమోద ముద్ర వేశారు.

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Handloom Society Elections | ఉమ్మడి జిల్లాలోని చేనేత సహకార సంఘాల (handloom society) పాలకవర్గాల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. సంఘాల ఓటరు తుది జాబితాలను సహకార శాఖ అధికారులు సిద్ధం చేసి ఆమోద ముద్ర వేశారు. దీంతో ఎన్నికల ప్రక్రియకు మార్గం సుగమమైంది. నిజామాబాద్ (Nizamabad), కామారెడ్డి (Kamareddy) జిల్లాల్లోని ఆర్మూర్, బోధన్, బీబీపేట, దోమకొండ (domakonda), కామారెడ్డి, పిట్లంలో చేనేత సహకార సంఘాలు ఉండగా, ఆర్మూర్‌లో పట్టు చేనేత సహకార సంఘం కొనసాగుతోంది.

Handloom Society Elections | నిబంధనల ప్రకారం ఓటు హక్కు..

చేనేత సహకార సంఘంలో సభ్యుడిగా ఉండి, రూ.300 వాటాధనం చెల్లించిన వారిని మాత్రమే పూర్తిస్థాయి సభ్యులుగా గుర్తించి ఓటు హక్కు కల్పిస్తారు. గతంలో సభ్యుడిగా ఉండి వాటాధనం చెల్లించని వారికి ఏప్రిల్ 17 వరకు అవకాశం కల్పించడంతో పలువురు చెల్లించారు. సవరణల అనంతరం తుది జాబితాలను ప్రక్రియ ప్రకారం ఆమోదించారు. దీంతో ఎన్నికల్లో పోటీ చేయాలంటే సభ్యులు డైరెక్టర్లుగా, ఛైర్మన్లుగా అవకాశం దక్కించుకోవడానికి ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించారు.

Handloom Society Elections | సంఘాల వారీగా ఓటర్ల వివరాలు

తుది జాబితా ప్రకారం నిజామాబాద్ జిల్లాలోని సంఘాల్లో 1,730 మంది, కామారెడ్డి జిల్లాలోని సంఘాల్లో 891 మంది ఓటర్లు ఉన్నారు. ఆర్మూర్ పట్టు సంఘంలో పురుషులు 222, మహిళలు 0, బోధన్‌లో 256, మహిళలు 42, నిజామాబాద్‌లో 679, మహిళలు 175, ఆర్మూర్‌లో పురుషులు 213, మహిళలు 143మంది ఉన్నారు. ఇక కామారెడ్డిలో పురుషులు 56, మహిళలు 1, పిట్లంలో పురుషులు 76, మహిళలు 25, బీబీపేటలో పురుషులు 324, మహిళలు 57, దోమకొండలో పురుషులు 288, మహిళలు 64 మంది ఓటర్లుగా నమోదయ్యారు.

Handloom Society Elections | ఎన్నికలకు చురుగ్గా ఏర్పాట్లు

తుది జాబితాల ప్రకటనతో ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ జాబితా ప్రకటనతో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని, ఎన్నికల నిర్వహణకు అవసరమైన తుది ప్రతిపాదనలను రాష్ట్ర సహకార ఎన్నికల అధికారులకు పంపుతామని సహాయ సంచాలకులు, చేనేత, జౌళి శాఖ, కామారెడ్డి ఎం.సాగర్ తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన కోసం అభ్యర్థులు, సభ్యులు ఎదురుచూస్తున్నారు. ఉత్సాహవంతులైన సభ్యులు తమ సంఘ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడానికి ఆసక్తి చూపుతున్నారు. తుది జాబితాలను సంఘాల నోటీసు బోర్డుల్లో ప్రదర్శించారు.

ఇది కూడా చదవండి: Cancer Drug Smuggling|క్యాన్సర్ మందుల అక్రమ రవాణాపై ఢిల్లీ హైకోర్టు ఫైర్.. కేంద్రం, CDSCO లకు కోర్టు నోటీసులు

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Bus Stone Attack | బస్సు ఆపలేదని రాయితో దాడి.. కేసు నమోదు చేసిన పోలీసులు

అక్షరటుడే, కామారెడ్డి: Bus Stone Attack | బస్సు ఆపడం లేదని...

Deloitte Visakhapatnam | విశాఖకు మరో ఐటీ దిగ్గజం.. డెలాయిట్ ఎంట్రీకి సన్నాహాలు.. ఐటీ హబ్‌గా దూసుకెళ్తున్న సాగర నగరం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Deloitte Visakhapatnam | ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లోని విశాఖపట్నం...

Saraswati Pushkaralu | సరస్వతి నది అంత్య పుష్కరాలు ప్రారంభం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Saraswati Pushkaralu | సరస్వతి నది అంత్య పుష్కరాలు...