Asian Games Shooting | షూటింగ్​లో భారత్​కు మరో రజతం

ఆసియా క్రీడల షూటింగ్​లో భారత్​ మరో సిల్వర్​ మెడల్​ సాధించింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Asian Games Shooting | జపాన్​లోని ఐచి నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో పదో రోజు భారత్​ షూటర్లు సత్తా చాటారు. మహిళా ట్రాప్ షూటింగ్ విభాగంలో రజత పతకం గెలుచుకున్నారు.

భారత త్రయం నీరూ దండా (118), ఆషిమా అహ్లావత్ (106), మనీషా కీర్ (104) సంయుక్తంగా 328 స్కోరు చేశారు. దీంతో సిల్వర్ మెడల్​ దక్కించుకున్నారు. అంతేగాకుండా నీరు ధండా 118 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి వ్యక్తిగత ఫైనల్‌కు అర్హత సాధించింది. ఇదే విభాగంలో పురుషుల జట్టు పతకం సాధించలేకపోయింది. అయితే శపత్ భరద్వాజ్ వ్యక్తిగత ఫైనల్‌కు అర్హత పొందాడు. తాజా సిల్వర్​ మెడల్​తో భారత్​ పతకాల సంఖ్య 46కు చేరింది. ఇందులో 4 బంగారు, 21 సిల్వర్​, 21 కాంస్య పతకాలు ఉన్నాయి. షూటింగ్​లో భారత్​ ఏకంగా 13 పతకాలు గెలిచింది.

Asian Games Shooting | అథ్లెటిక్స్​లో..

ఆసియా క్రీడల్లో అథ్లెటిక్స్​ పోటీలు నేటితో ముగియనున్నాయి. పలువురు భారత క్రీడాకారులు పతకం కోసం పోటి పడుతున్నారు. గుల్వీర్ సింగ్, అవినాష్ సాబ్లే, గురిందర్‌వీర్ సింగ్, అనిమేష్ కుజుర్ హరిత భద్ర పతకాల వేటలో ముందున్నారు. అథ్లెటిక్స్​లో భారత్ 19 పతకాలు సాధించింది. షూటింగ్​లో రజతం సాధించిన మహిళా క్రీడాకారులను కేంద్ర మంత్రి కిరణ్​ రిజిజు ఎక్స్​ వేదికగా అభినందించారు.

 

దీనిని కూడా చదవండి : Sep 29 Gold Prices | పసిడి ప్రియులకు అలెర్ట్​.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *