Kamareddy Mart Theft | మార్ట్​లో భారీ చోరీ.. రూ.లక్ష ఎత్తుకెళ్లిన దొంగలు

Srinivas Kolluri

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Mart Theft | కామారెడ్డి (Kamareddy) పట్టణంలో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. అర్ధరాత్రి ఓ మార్ట్​లో చొరబడిన ఇద్దరు గుర్తు తెలియని యువకులు రూ.లక్ష నగదు తీసుకుని పారిపోయారు.

పట్టణంలోని శ్లోక మార్ట్ (Shloka Mart) సిబ్బంది ఎప్పటిలాగే గురువారం రాత్రి మూసేసి వెళ్లిపోయారు. అర్ధరాత్రి తర్వాత ఇద్దరు యువకులు మార్ట్ అద్దాలు పగులగొట్టి లోపలికి చొరబడినట్టుగా తెలుస్తోంది. మార్ట్ వద్ద ఉన్న సీసీ కెమెరాలో చోరీకి పాల్పడిన వ్యక్తుల దృశ్యాలు రికార్డయ్యాయి. క్యాష్ కౌంటర్ వద్ద డ్రాలో ఇద్దరు యువకులు నగదు కోసం వెతికినట్టుగా సీసీ కెమెరాలో రికార్డయింది. నగదు లభించగానే పారిపోయారు.

Kamareddy Mart Theft | పరిశీలించిన పోలీసులు

రోజు మాదిరిగా శుక్రవారం ఉదయం మార్ట్ ఓపెన్ చేయడానికి వెళ్లిన యాజమాన్యం పగిలిన అద్దాలను చూసి ఆందోళనకు గురయింది. చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి..: Ramareddy Accident | పైప్​లైన్​ గుంతలో పడిన కారు.. దంపతులకు గాయాలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *