PRTU Committee | ఉపాధ్యాయుల సమస్కల పరిష్కారానికి కృషి..

ఉపాధ్యాయుల సమస్కల పరిష్కారానికి కృషి చేస్తామని పీఆర్టీయూ పెద్దకొడప్​గల్​ మండల అధ్యక్షుడు జగదీష్​ అన్నారు.

shashi kiran Mottala

అక్షటుడే, పెద్దకొడప్‌గల్: PRTU Committee | ఉపాధ్యాయుల సమస్కల పరిష్కారానికి కృషి చేస్తామని పీఆర్టీయూ మండల అధ్యక్షుడు జగదీష్​ అన్నారు. మండల కేంద్రంలో (Peddakodapgal) పీఆర్టీయూ (PRTU) మండల సర్వసభ్య సమావేశం జిల్లా అధ్యక్షుడు కుశాల్, జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్ట శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో మండలానికి చెందిన ఉపాధ్యాయులు పీఆర్టీయూ మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా బి. జగదీష్‌ను వరుసగా నాలుగోసారి, మండల ప్రధాన కార్యదర్శిగా కిషోర్ సింగ్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.

PRTU Committee | సంఘాన్ని మరింత బలోపేతం చేస్తాం..

​నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు బి. జగదీష్, ప్రధాన కార్యదర్శి కిషోర్ సింగ్‌లను జిల్లా నాయకులు శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఉపాధ్యాయులందరూ మమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తన వంతుగా నిరంతరం కృషి చేస్తామని, సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్తానని అన్నారు. ​ఈ కార్యక్రమంలో మండల పీఆర్టీయూ సభ్యులు, ఉపాధ్యాయులు, సంఘ నాయకులు పాల్గొని నూతనంగా ఎన్నికైన నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఇది కూడా చదవండి: ‘‘నీకు ఎవరైనా నచ్చలేదా వదిలేయ్. వాళ్లను హేట్ చేయడం, ట్రోల్ లాంటివి చేయొద్దు. ఆ సమయాన్ని మీ కోసం ఉపయోగించుకోండి’’ 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *