అక్షరటుడే, నందిపేట్/ఆర్మూర్ : Urea Supply Failure | రాష్ట్రవ్యాప్తంగా యూరియా సరఫరాలో కాంగ్రెస్ అట్టర్‌ప్లాప్ అయిందని మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి (EX MLA Jeevan Reddy) విమర్శించారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనకు నిరసనగా నందిపేట్ (Nandipet) మండల కేంద్రంలోని నంది విగ్రహం వద్ద రైతు సదస్సులో పాల్గొన్నారు.
Urea Supply Failure | రైతులకు ద్రోహం
జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ద్రోహుల ప్రభుత్వమన్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్ ఇచ్చి మోసం చేసినందున రైతులు క్షమించరన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ను నిర్లక్ష్యం చేసి తెలంగాణ భూములను ఎండబెట్టి రైతులు పొట్టకొట్టిన కాంగ్రెస్‌ది రాక్షస జాతిగా ఆయన అభివర్ణించారు. కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులపై కాంగ్రెస్ కక్ష తెలంగాణ రైతులకు శిక్ష అన్నారు. రైతు రుణమాఫీ పెద్ద బోగస్ అని.. రేవంత్ సర్కార్ తీరుతో అన్నదాతలు ఆగమయ్యారని పేర్కొన్నారు.
Urea Supply Failure | 24 గంటల ఉచిత విద్యుత్ ఏమైంది..
ఎన్నికల సమయంలో రైతులకు 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రస్తుతం క్షేత్రస్థాయిలో 8 నుండి 12 గంటల వరకు కూడా కరెంటు ఇవ్వట్లేదన్నారు. తెలంగాణలో 22ఏ నిషేధిత భూముల జాబితా వ్యవహారంలో జీవన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 22ఏ జాబితాలో నుండి భూములను తొలగించాలంటూ ఎన్వోసీలు ఇవ్వడానికి ల్యాండ్ వ్యాల్యూలో 30శాతం వరకు కమీషన్లు డిమాండ్ చేస్తున్నారని ఆరోపణలు చేశారు.
అధికార పార్టీకి తొత్తులుగా పోలీసులు..
ఆశన్న గారి జీవన్ రెడ్డి పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుండి జరుగుతున్న పరిణామాలపై ఆయన మండిపడ్డారు. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారిపోయి బీఆర్ఎస్ కార్యకర్తలను హింసిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ ఛైర్మన్ విఠల్ రావు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: మంత్రి కొండా సురేఖపై వేటు