Weather Update | రాష్ట్రానికి నేడు భారీ వర్షసూచన

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Update | రాష్ట్రంలో వర్షాలు లేక అల్లాడుతున్న అన్నదాతలపై వరుణుడు కరుణ చూపాడు. రెండు రోజులుగా అక్కడక్కడ తేలికపాటి మోస్తరు జల్లులు కురుస్తున్నాయి. ఆదివారం సైతం పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (IMD) అధికారులు తెలిపారు.

కొన్ని రోజులుగా వర్షాలు లేక వరినాట్లు సాగడం లేదు. మరోవైపు వేసిన పంటలు ఎండిపోతున్నాయి. ఈ క్రమంలో రెండు రోజులుగా అక్కడక్కడ పడుతున్న వర్షాలు పంటలకు మేలు చేశాయి. ఆదివారం ఆదిలాబాద్, అసిఫాబాద్​, నిర్మల్​, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, కరీంనగర్, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. మధ్యాహ్నం నుంచి రాత్రి సమయంలో వాన పడే అవకాశం ఉంది. ఈ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయి.

Weather Update | మోస్తరు వర్షాలు

తెలంగాణలోని సంగారెడ్డి, వికారాబాద్​, మెదక్​ (Medak), రంగారెడ్డి, మహబూబ్​నగర్​, కామారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, హన్మకొండ, వరంగల్​ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. సాయంత్రం, రాత్రి వేళలో వర్షం పడే ఛాన్స్​ ఉంది. హైదరాబాద్​ నగరంలోని పలు ప్రాంతాల్లో సాయంత్రం వేళ చిరు జల్లులు కురుస్తాయి.

Weather Update | వర్షపాతం వివరాలు

పలు జిల్లాల్లో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు భారీ వర్షాలు కురిశాయి. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, మంచిర్యాల, సంగారెడ్డి, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, ఖమ్మంలో జిల్లాల్లో వాన పడింది. భూపాలపల్లి జిల్లా పలిమెలలో అత్యధికంగా 91.8 మి.మీ. వర్షపాతం నమోదు అయింది. ఇచ్చొడలో 63.5, ఆర్మూరు 58.3, బాల్కొండ 56.8, మెదక్ జిల్లా రేగోడ్ 56.3, కన్నాయిగూడెంలో 52.5 మిల్లిమీటర్ల వర్షం కురిసింది.

దీనిని కూడా చదవండి : Visakhapatnam Accident | విశాఖ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం, ఒకరికి తీవ్ర గాయాలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *