అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Traffic Restrictions | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు పనుల నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. సీసీ రోడ్డు నిర్మాణ పనుల దృష్ట్యా అక్టోబర్ 19 నుంచి 22 వరకు పీవీఎన్ఆర్ (PVNR) ఎక్స్‌ప్రెస్‌వేపై మెహదీపట్నం వైపు వెళ్లే మార్గంలో పిల్లర్ నంబర్ 37 వద్ద ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి.
అత్తాపూర్, షేక్‌పేట్, లంగర్ హౌస్, లక్డీకాపూల్ ప్రాంతాల మధ్య ప్రయాణించే వారు సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. మెహదీపట్నం వైపు సీసీ రోడ్ లేయింగ్ పని అక్టోబర్ 19 నుండి 22 వరకు కొనసాగుతుంది, తద్వారా ట్రాఫిక్ మళ్లింపులు ప్రారంభమవుతాయి.
Traffic Restrictions | మళ్లింపులు ఇలా..
అత్తాపూర్ నుంచి నాంపల్లి వైపు వెళ్లే వాహనదారులు పిల్లర్ నంబర్ 92 దగ్గర యూ-టర్న్ తీసుకోవాలి. 100 అడుగుల రోడ్డు పురాణపూల్ జుమ్మెరత్ బజార్ మీదుగా వెళ్లాలి. షేక్‌పేట్ నుంచి అత్తాపూర్ వైపు వెళ్లే వాహనాలు నానల్ నగర్ నుంచి బాలికా భవన్ జంక్షన్, లక్ష్మి నగర్ మీదుగా వెళ్లాలి. షేక్‌పేట్ నుంచి లంగర్‌హౌస్, సన్ సిటీ వెళ్లేవారు కేఎఫ్‌సీ యూటర్న్, షేక్‌పేట్ నాలా, బంజరీ దర్వాజా, మక్కాయ్ దర్వాజా, రామ్‌దేవ్‌గూడ, టిప్పు ఖాన్ జంక్షన్ మీదుగా రాకపోకలు సాగించాలి.
దీనిని కూడా చదవండి : Eagle Force Raid | ఈగల్ ఫోర్స్ భారీ ఆపరేషన్.. 11 మంది అరెస్ట్