అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Ganja Smuggling | నిజామాబాద్ (Nizamabad) పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారు. గంజాయిని రవాణా చేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈమేరకు 1వ టౌన్ పోలీసులు వివరాలు వెల్లడించారు.
Ganja Smuggling | రైల్వేస్టేషన్ వద్ద..
నగరంలోని రైల్వే స్టేషన్ వద్ద 18వ తేదీ ఆదివారం పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ఓ వ్యక్తి పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడిని పట్టుకున్నారు. అతడిని మల్కాపూర్తండాకు చెందిన సలావత్ శ్రీనివాస్‌గా గుర్తించారు. అతడి వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా 4.368 కిలోల గంజాయి లభ్యమైంది. విచారణలో ఒడిశాకు చెందిన పరిమల్ హర్దాల్ వద్ద గంజాయి కొనుగోలు చేసి, నాందేడ్‌కు చెందిన వాహిద్ ఖాన్ పాషాకు సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. అలాగే గంజాయి వ్యాపారానికి ఆటోనగర్‌కు చెందిన ఇబ్రహీం ఖాన్, గాంధారికి చెందిన నునావత్ మోహన్ ప్రోత్సహించినట్లు విచారణలో వెల్లడైంది. ఈ కేసులో ఇబ్రహీం ఖాన్‌ను సైతం సోమవారం ఈ రోజు అరెస్టు చేశారు. వీరిద్దరిని తదుపరి చర్యల నిమిత్తం న్యాయస్థానంలో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: వాహనాలకు నిమ్మ-మిరప దండ ఎందుకు కడతారు?