Konda Laxman Bapuji | యువత కొండా లక్ష్మణ్​ బాపూజీ స్ఫూర్తితో ముందుకు సాగాలి

యువత కొండా లక్ష్మణ్​ బాపూజీ స్ఫూర్తితో ముందుకు సాగాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్​ అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Konda Laxman Bapuji | యువత కొండా లక్ష్మణ్​ బాపూజీ స్ఫూర్తితో ముందుకు సాగాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్​ అన్నారు. తెలంగాణ ఉద్యమ నాయకుడు, ఉద్యమ నేత కొండా లక్ష్మణ్ బాపూజీ 14వ వర్ధంతి సందర్భంగా వినాయక్​నగర్​ హనుమాన్​ జంక్షన్​లో ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు.

Konda Laxman Bapuji | 90 ఏళ్ల వయస్సుల్లోనూ..

ఒక శాసనసభ్యుడిగా, శాసనసభ ఉపనేతగా, మంత్రిగా రాష్ట్రానికి కొండా లక్ష్మణ్​ బాపూజీ ఎన్నో సేవలందించారని నరాల సుధాకర్​ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవికి రాజీనామా చేసి, తెలంగాణ (Telangana) వచ్చిన తర్వాతనే పదవులు తీసుకుంటానని శపథం చేసిన గొప్ప నాయకుడు ఆయన అని అన్నారు. తొంభై ఏళ్ల వయసులో కూడా విశ్రాంతి తీసుకోకుండా బస్సు యాత్ర చేసి యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలంగాణ ఉద్యమ పాఠాలు నేర్పిన గొప్ప నాయకుడని కీర్తించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు బుస్సా ఆంజనేయులు, దర్శనం దేవేందర్, చంద్రకాంత్, బగ్గలి అజయ్, సాయి బసవ కోడూరు స్వామి, గంగాధర్, అంకం రావు, మురళి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Ganesh Immersion | గణేష్ నిమజ్జనానికి కాకతీయ మెయిన్ కెనాల్‌లోకి నీటి విడుదల

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *