Farmhouse Politics | రాష్ట్రంలో ఫామ్​హౌస్​ రాజకీయాలు

రాష్ట్రంలో ఫామ్​హౌస్​ రాజకీయాలు హాట్​ టాపిక్​గా మారాయి. బీఆర్​ఎస్​ నేతల ఫామ్​హౌస్​లను కాంగ్రెస్​ నాయకులు సందర్శిస్తున్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Farmhouse Politics | రాష్ట్రంలో ఫామ్​హౌస్​ రాజకీయాలు హాట్​ టాపిక్​గా మారాయి. బీఆర్​ఎస్​ నేతలు భూ కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ.. వారి ఫామ్​హౌస్​లను కాంగ్రెస్​ నాయకులు సందర్శిస్తున్నారు.

ఎర్రవల్లిలో కేసీఆర్ (KCR) ప్రభుత్వ భూములను ఆక్రమించారని ఇటీవల సీఎం ఆరోపించిన విషయం తెలిసిందే. ఆయన ఆదేశాల మేరకు అధికారులు ఆ గ్రామంలో సర్వే చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్​ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇతర బీఆర్​ఎస్​ నాయకుల ఫామ్​హౌస్​లను సందర్శిస్తుండటం గమనార్హం. జన్వాడలోని కేటీఆర్​ ఫామ్​హౌస్​, మొయినాబాద్​, అజీజ్​నగర్​లోని ఇతర నేతల పామ్​హౌస్​లను వారు సందర్శించారు. తాజాగా సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్​రెడ్డి ఫామ్​హౌస్​ సందర్శనకు వెళ్లారు. దీంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు.

Farmhouse Politics | చర్యలు కరువు

కాంగ్రెస్​ ప్రజాప్రతినిధులు పామ్​హౌస్​లను సందర్శించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అసైన్డ్​, ప్రభుత్వ భూములు, ఎఫ్​టీఎల్ పరిధిలో వాటిని నిర్మించారని కాంగ్రెస్​ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారంలో ఉంది. ఒకవేళ వారు చట్ట విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే కూల్చి వేయొచ్చు. అలా కాకుండా సందర్శనల పేరిట రాజకీయాలు చేస్తుండటంపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.

Farmhouse Politics | సామాన్యులపై ప్రతాపం

హైదరాబాద్ నగరంలో హైడ్రా అనేక నిర్మాణాలను కూల్చి వేసింది. ఇందులో పేదలకు చెందిన ఇళ్లు వేలల్లో ఉన్నాయి. నిబంధనలు పాటించలేదని, ఎఫ్​టీఎల్​, బఫర్​ జోన్​లో నిర్మించారని అనేక ఇళ్లను హైడ్రా అధికారులు కూల్చివేశారు. అంతేగాకుండా ఖమ్మం వెలుగుమట్లలో సైతం పేదల గుడిసెలను తొలగించారు. పేదల విషయంలో మాత్రం వేగంగా చర్యలు చేపడుతున్నా ప్రభుత్వం.. పెద్దల జోలికి ఎందుకు వెళ్లడం లేదన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ బీఆర్​ఎస్​ నాయకులు నిజంగా తప్పు చేసి ఉంటే వాటిని కూల్చివేయాలని ప్రజలు అంటున్నారు. అలా కాకుండా సందర్శనల పేరిట రాజకీయాలు చేయడంపై విమర్శలు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Cases on Farmers | రైతులపై అక్రమ కేసులు.. కేటీఆర్​ ఆగ్రహం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *