Bandlaguda Murder | కొడవళ్లు, కత్తులతో వెంటబడి.. బండ్లగూడలో ఒకరి దారుణ హత్య

హైదరాబాద్​ నగరంలోని బండ్లగూడలో ఓ వ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bandlaguda Murder | హైదరాబాద్​ (Hyderabad) నగరంలోని నాగోల్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని దుండగులు వెంబడించి హత్య చేశారు.

నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడలో వేట కొడవళ్లు, కత్తులతో వెంట పడి ఒకరిని దుండగులు దారుణంగా హత్య చేశారు. నిందితులు వెంటబడటంతో ఆ వ్యక్తి ఓ వైన్​ షాపులో తలదాచుకున్నాడు. ఆ విషయాన్ని గమనించిన నిందితులు బయటకు లాగి మరి దాడి చేశారు. కత్తులు, కొడవళ్లతో దాడి చేయడంతో బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

Bandlaguda Murder | పాత కక్షలతో..

మృతుడు ఇల్లెందుకు చెందిన రౌడీ షీటర్ నయీమ్‌గా పోలీసులు గుర్తించారు. పాత కక్షల నేపథ్యంలో హత్య జరిగినట్టు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు గాలిస్తున్నారు. వైన్ షాపు సమీపంలోని సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ హత్యతో స్థానికులు ఉలిక్కిపడ్డారు.

ఇది కూడా చదవండి..: Gold Ganesha Idol | బంగారు కాంతుల్లో కొలువైన విఘ్నేశ్వరుడు.. ఫీల్‌ఖానాలో భక్తుల మనసు దోచుకుంటున్న వజ్రాల గణపతి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *