అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Ketan Death | మహారాష్ట్ర (Maharashtra)లో పారిశ్రామికవేత్త కుమారుడి మరణం సంచలనంగా మారింది. కేతన్ అనే యువకుడు ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆయనను కాబోయే భార్య, ఆమె ప్రియుడు హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.
కేతన్‌ను అతని కాబోయే భార్య, ఆమె ప్రియుడు కలిసి లోతైన లోయలోకి తోసేశారని దర్యాప్తు అధికారులు గుర్తించారు. నిందితులకు మరెవరైనా సహకరించారా అనే కోణంలో పోలీసులు ఇప్పుడు విచారణ జరుపుతున్నారు.
Ketan Death | అసలు ఏం జరిగిందంటే..
కేతన్ అగర్వాల్, సియా గోయల్‌కు పెళ్లి నిశ్చయమైంది. నవంబర్‌లో పెళ్లి చేయాలని రెండు కుటుంబాలు నిర్ణయించాయి. ఈ మేరకు రాజస్థాన్‌లో రూ.17 కోట్లతో ప్యాలెస్ కూడా బుక్ చేశారు. ఈ క్రమంలో జూన్ 18న కేతన్ అగర్వాల్ తన కాబోయే భార్య సియా గోయల్ పుట్టినరోజును జరుపుకోవడానికి లోహగడ్‌కు ట్రెక్కింగ్‌కు వెళ్ళాడు. అనంతరం పూణే సమీపంలోని లోహగడ్ కోట వద్ద ఆయన లోయలో పడి చనిపోయాడు.
Ketan Death | ప్రమాదంగా చిత్రీకరించే యత్నం
కేతన్ ఫొటోలు తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు లోయలో పడి చనిపోయాడని కాబోయే భార్య సియా గోయల్ చెప్పింది. దీంతో మూడు గంటల ఆపరేషన్ తర్వాత రెస్క్యూ బృందం మృతదేహాన్ని వెలికితీసింది. అయితే, లోనావాలా రూరల్ పోలీసులు విచారణలో పొంతన లేని విషయాలను కనుగొన్నారు. మొబైల్ డేటా, కాల్ రికార్డులు, సంఘటనా స్థలంలోని వ్యక్తుల వాంగ్మూలాలు అనుమానాలను రేకెత్తించాయి. తరువాత పోలీసులు అతని కాబోయే భార్యను, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని కాబోయే భార్య మరియు ఆమె ప్రియుడు చేతన్ చౌదరి కలిసి లోతైన లోయలోకి తోసేశారని దర్యాప్తు అధికారులు గుర్తించారు.
Ketan Death | పెళ్లి ఇష్టం లేకపోవడంతో..
కేతన్ మహారాష్ట్రలోని పూణే సమీపంలో ఉన్న పింప్రి-చించ్‌వాడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ వ్యాపారవేత్త విశాల్ అగర్వాల్ కుమారుడు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో నవంబర్‌లో అతని వివాహం జరగాల్సి ఉంది. ఇరు కుటుంబాల వారు జైపూర్‌లో రూ. 17 కోట్లకు ఒక ప్యాలెస్‌ను బుక్ చేసుకుని, అతిథుల కోసం రెండు ప్రైవేట్ విమానాలను కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం. అయితే ఈ పెళ్లి సియా గోయల్‌కు ఇష్టం లేదు. అతడిని వదిలించుకోవడానికి ఆమె పథకం వేసి, తన ప్రియుడి సహాయం తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆమె తన పుట్టినరోజున కేతన్‌ను ట్రెకింగ్ కోసం లోహగడ్‌కు తీసుకెళ్లింది. అవకాశం దొరకడంతో, ఆమె చేతన్ సహాయంతో కేతన్‌ను లోతైన లోయలోకి తోసివేసింది. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Fiancée and Her Lover Arrested for Murdering #Pune Real Estate Director by Pushing Him Off Lohagad Fort
In a big twist in the death of real estate firm director Ketan Vishal Agrawal, police on Tuesday arrested his fiancée and her lover for allegedly pushing him into a deep gorge… pic.twitter.com/YxYJcJseIW
— Siraj Noorani (@sirajnoorani) June 23, 2026
దీనిని కూడా చదవండి : Hyderabad ATM theft | హైదరాబాద్‌లో భారీ చోరీ.. ఏటీఎం వ్యాన్ నుంచి రూ. 17 లక్షల మాయం!