అక్షరటుడే, వెబ్‌డెస్క్ : US Iran Attacks | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారడం లేదు. ఇరాన్ నౌకా రవాణాపై దిగ్బంధనాన్ని పునరుద్ధరిస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించిన నేపథ్యంలో అమెరికా సైన్యం ఇరాన్‌పై వరుసగా మూడో రాత్రి కూడా దాడులు చేసింది.
ఇరాన్‌పై ఏడు గంటల పాటు దాడులు చేశామని యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు దాడులు కొనసాగాయని పేర్కొంది. ముఖ్యంగా హర్ముజ్‌లో నౌకలపై ఇరాన్ దాడులు చేపడుతుండటంతో అమెరికా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా హర్మూజ్ జలసంధి, ఇరాన్ తీరప్రాంతాల సమీపంలోని సైనిక లక్ష్యాలపై దాడులు చేసింది.
US Iran Attacks | ఇరాన్ కీలక ప్రకటన
అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ సైతం క్షిపణులను ప్రయోగిస్తోంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులు చేస్తోంది. అమెరికా దాడులు ముగిసే వరకు హర్ముజ్ జలసంధిని మూసి ఉంచుతామని టెహ్రాన్ స్పష్టం చేసింది. తమ ఆదేశాలను పట్టించుకోకుండా జలసంధి మీదుగా నౌకలు ప్రయాణిస్తే దాడులు చేస్తామని హెచ్చరించింది. అమెరికా–ఇరాన్ దాడులు, ప్రతిదాడులు.. హర్ముజ్ జలసంధి మూసివేతతో మరోసారి ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. దీంతో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.
ఇది కూడా చదవండి.. Nitish Kaushal FBI | ఎఫ్‌బీఐ మోస్ట్ వాంటెడ్ జాబితాలో భారత సంతతికి చెందిన నితీష్ కౌశల్