Chess Tournament | చెస్​ ఆడితే విద్యార్థుల్లో ఏకాగ్రత పెరుగుతుంది

చెస్​ ఆడితే ఏకాగ్రత పెరుగుతుందని ఒలింపిక్​ అసోసియేషన్​ జిల్లా కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Chess Tournament | చెస్​ ఆడితే ఏకాగ్రత పెరుగుతుందని ఒలింపిక్​ అసోసియేషన్ (Olympic Association)​ జిల్లా కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య అన్నారు. జిల్లాస్థాయి చెస్​ అండర్​–13 పోటీలు నగరంలోని(Nizamabad) ‘అభ్యాస ద స్కూల్​’లో (Abhyasa The School) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు.

Chess Tournament | నిత్యం సాధన చేయాలి

చిన్నతనం నుంచే విద్యార్థులు చెస్​ ఆడితే పిల్లల్లో ఏకాగ్రత పెరిగి, చదువులోనూ ముందంజలో ఉంటారని బొబ్బిలి నర్సయ్య అన్నారు. ప్రతిరోజూ సాధన చేయడం ద్వారా చెస్ క్రీడతో పాటు శారీరక, మానసిక అభివృద్ధిని సాధించవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేశారు. విజేతలు.. బాలుర విభాగంలో ప్రథమ స్థానంలో గౌరంగా అశోక్ (ఆచార్య విద్యాలయం, బోధన్), ​ద్వితీయ స్థానంలో డి. సోహన్ (మోడల్ స్కూల్, ఆర్మూర్) నిలిచారు. అలాగే బాలికల విభాగంలో ​ప్రథమ స్థానంలో బి.హరిణి (శ్రీ చైతన్య), ​ద్వితీయ స్థానంలో ఆర్.అభిజ్ఞ (అభ్యాస ద స్కూల్) ఉన్నారు. ​ఈ కార్యక్రమంలో వెయిట్‌లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అబ్బాపూర్ రవీందర్, చెస్ అసోసియేషన్ ప్రతినిధులు ఏ. రమేష్, నాగరాజు, మధుకర్, చీఫ్ ఆర్బిటర్ శివ సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Devi Sri Prasad as ‘PARSHI’ in… #YELLAMMA

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *