PM Modi Philippines Visit | ఫిలిప్పీన్స్ పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ..

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా పర్యటనకు బయలుదేరారు.

Shivam nagarani

అక్షరటుడే, వెబ్​డెస్క్: PM Modi Philippines Visit | భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా పర్యటనకు బయలుదేరారు. ఆ దేశ అధ్యక్షుడు ఫెర్డినాండ్ ఆర్. మార్కోస్ జూనియర్ ప్రత్యేక ఆహ్వానం మేరకు ప్రధాని ఈ పర్యటన చేపట్టారు.

నవంబర్ 17న మనీలాలో జరగనున్న 23వ ఆసియాన్-భారత్ సదస్సు , 21వ తూర్పు ఆసియా సదస్సులలో ఆయన పాల్గొననున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం (PMO) అధికారికంగా ప్రకటించింది. పర్యటనకు ముందు ప్రధాని (PM Modi) మాట్లాడుతూ.. ఆసియాన్ దేశాలతో సంబంధాలు భారత్ అనుసరిస్తున్న ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’కి గుండెకాయ వంటివని, ‘మహాసాగర్’ (MAHASAGAR) దార్శనికతలో వీటికి ఎంతో ప్రాధాన్యత ఉందని పేర్కొన్నారు.

PM Modi Philippines Visit | వాణిజ్య బలోపేతమే లక్ష్యం..

శతాబ్దాల నాటి చారిత్రక, సాంస్కృతిక బంధంతో మొదలైన భారత్-ఆసియాన్ భాగస్వామ్యం నేడు వాణిజ్యం, కనెక్టివిటీ, సముద్ర భద్రత, సాంకేతికత రంగాల్లో మరింత విస్తరించిందని ప్రధాని మోదీ తెలిపారు. ఆసియాన్-భారత్ సదస్సులో తోటి దేశాల నేతలతో కలిసి సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంతో పాటు, ప్రాంతీయ, ప్రపంచ సవాళ్లపై తూర్పు ఆసియా సదస్సులో చర్చించనున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, పరస్పర సహకారాన్ని బలోపేతం చేసే దిశగా తన అభిప్రాయాలను పంచుకోనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఫిలిప్పీన్స్‌లో నివసిస్తున్న ప్రవాస భారతీయ సమాజంతోనూ ప్రధాని ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.

ఇది కూడా చదవండి..: Free train travel | విద్యార్థులకు రైల్వే శాఖ బంపర్ ఆఫర్: ప్యాసింజర్ రైళ్లలో పూర్తిగా ఉచిత ప్రయాణం.. ఎవరికి వర్తిస్తుందంటే?

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *