Nov 16 Market Analysis | రెడ్‌లో ఆసియా మార్కెట్లు.. పాజిటివ్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాలతో సాగుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ లాభాలతో ఉండడంతో మన మార్కెట్లు పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Nov 16 Market Analysis | పశ్చిమాసియా (West asia)లో కొనసాగుతున్న పరిణామాలు మళ్లీ ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. గల్ఫ్‌లోని ఓ అమెరికా సైనిక స్థావరంపై దాడి చేసినట్లు టెహ్రాన్ ప్రకటించగా.. ఇరాన్ జరిపిన పలు వైమానిక దాడులను అడ్డుకున్నామని బహ్రెయిన్ తెలిపింది.

మరోవైపు అమెరికాతో చర్చలకైనా, లేదా తిరిగి ఘర్షణకైనా టెహ్రాన్ సిద్ధంగా ఉందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఖేర్ ఖాలిబాఫ్ ప్రకటించడంతోపాటు మరిన్ని సైనిక చర్యలకు పాల్పడవద్దని అమెరికాను హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఇరాన్, అమెరికాల మధ్య ఉద్రిక్తతలతోపాటు ముడి చమురు (Crude oil) ధరలు, ఈ వారంలో విడుదలయ్యే యూఎస్ ఫెడరల్ రిజర్వ్ మినిట్స్‌పై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఈ రోజు వెలువడే దేశీయ మార్కెట్లలో టోకు ధరల ద్రవ్యోల్బణ డేటా మన మార్కెట్లను ప్రభావితం చేయనుంది.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

Nov 16 Market Analysis | యూఎస్ మార్కెట్లు..

గత సెషన్‌లో నాస్‌డాక్ 0.91 శాతం, ఎస్ అండ్ పీ 0.40 శాతం నష్టపోగా.. సోమవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.02 శాతం నష్టంతో ఉంది.

Nov 16 Market Analysis | యూరోప్ మార్కెట్లు..

జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.08 శాతం నష్టపోగా.. ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.09 శాతం లాభపడింది. యూకేకు చెందిన ఎఫ్టీఎస్ ఈ ఫ్లాట్‌గా ముగిసింది.

Nov 16 Market Analysis | ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాలతో ఉన్నాయి. ఉదయం 7.45 గంటల ప్రాంతంలో హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.97 శాతం లాభంతో ఉండగా.. తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 2.92 శాతం, సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 2.20 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 1.48 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.61 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.06 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.38 శాతం లాభంతో ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్ అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

గమనించాల్సిన అంశాలు..

  • విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు వరుసగా నాలుగో సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 5,736 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
  • డీఐఐలు వరుసగా పదకొండో సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా నిలిచారు. రూ. 2,253 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 19 పైసలు బలహీనపడి 94.24 వద్ద ఉంది.
  • యూఎస్ డాలర్ ఇండెక్స్ 103.41 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 5.14 శాతం వద్ద ఉంది.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 1 నుంచి 0.98 కు తగ్గింది.
  • విక్స్ 6.75 శాతం తగ్గి 15.50 వద్ద ఉంది.
  • బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 95.30 డాలర్ల వద్ద ఉంది.
Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *