Telangana Employee Arrears | ఉద్యోగులకు మరో తీపికబురు.. రూ.2 వేల కోట్ల బకాయిల విడుదల

రూ.10 వేలలోపు విలువైన పెండింగ్ బిల్లులన్నింటినీ ప్రభుత్వం క్లియర్ చేసింది. ఈ క్రమంలో సుమారు 5 లక్షలకు పైగా టోకెన్లకు సంబంధించిన బిల్లులను చెల్లించినట్లు అధికారులు వెల్లడించారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Telangana Employee Arrears | రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి శుభవార్త అందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ Finance మరో రూ.2 వేల కోట్ల బకాయిల విడుదలకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా సోమవారం నిధులు విడుదల చేశారు.

Employee Health Scheme | ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య పథకం

Telangana Employee Arrears | గత నెల 29న తొలి విడతగా

ఉద్యోగ సంఘాల నేతలకు ఇచ్చిన హామీ మేరకు 100 రోజుల్లో మొత్తం రూ.6 వేల కోట్ల బకాయిలను విడుదల చేస్తామని ప్రభుత్వం Govt ఇప్పటికే ప్రకటించింది. ఇందులో భాగంగా గత నెల 29న తొలి విడతగా రూ.2 వేల కోట్లు విడుదల చేయగా, తాజాగా రెండో విడతలో మరో రూ.2 వేల కోట్లు విడుదల చేసింది. దీంతో ఉద్యోగులు, రిటైర్డ్ సిబ్బందికి ఊరట లభించింది.

పదవీ విరమణ పొందిన ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం, రిటైర్డ్ ఉద్యోగులు, జిల్లా పరిషత్ ఉపాధ్యాయుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్) బకాయిలను పూర్తిగా చెల్లించినట్లు వెల్లడించింది. ప్రస్తుతం రిటైర్డ్ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో ఎలాంటి పెండింగ్‌లు లేవని తెలిపింది. అలాగే 2025 సెప్టెంబర్ వరకు ఉన్న కమ్యూటేషన్ బకాయిలన్నింటినీ పూర్తిగా చెల్లించినట్లు పేర్కొంది.

Telangana Employee Arrears | 5 లక్షలకు పైగా టోకెన్లు

ఇదిలా ఉండగా, రూ.10 వేలలోపు విలువైన పెండింగ్ బిల్లులన్నింటినీ ప్రభుత్వం క్లియర్ చేసింది. ఈ క్రమంలో సుమారు 5 లక్షలకు పైగా టోకెన్లకు సంబంధించిన బిల్లులను చెల్లించినట్లు అధికారులు వెల్లడించారు.

ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంపై ప్రభుత్వాన్ని అభినందించారు. మిగిలిన బకాయిలను కూడా దశలవారీగా విడుదల చేస్తామని ఆర్థిక శాఖ అధికారులు వెల్లడించడంతో ఉద్యోగుల్లో ఆశాభావం నెలకొంది.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *