అక్షరటుడే, కామారెడ్డి: Sadashivanagar Police | హత్యాయత్నం కేసులో నిందితులైన అక్కాతమ్ముళ్లను కామారెడ్డి జిల్లా సదాశివనగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు ఎస్సై పుష్పరాజ్ సోమవారం మీడియాకు వివరాలు వెల్లడించారు.
Sadashivanagar Police | ధర్మారావు పేటకు చెందిన..
ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల (జూన్) 27న రాత్రి 8 గంటల సమయంలో ధర్మారావుపేట గ్రామానికి చెందిన గైని రమేష్ మోటార్ సైకిల్‌పై వెళ్తుండగా గుర్తుతెలియని కారు వెనుక నుంచి ఢీకొట్టింది.
అనంతరం కారులో నుంచి దిగిన వ్యక్తులు కర్రతో రమేష్‌పై దాడి చేసి పరారయ్యారు. ఈ మేరకు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సదాశివనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో గతంలో నమోదైన క్రిమినల్ కేసు (Criminal Case) నేపథ్యంలో ఏర్పడిన వ్యక్తిగత కక్షతోనే ఈ దాడి జరిగినట్లు పోలీసులు గుర్తించారు.
ధర్మారావుపేటకు చెందిన గాండ్ల లావణ్య, ఆమె తమ్ముడు గాండ్ల సతీష్ కలిసి ముందస్తు పథకం ప్రకారం రమేష్‌ను హతమార్చాలనే ఉద్దేశంతో కారుతో ఢీకొట్టి కర్రతో కొట్టినట్లు తేలింది.
సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీ, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా నిందితులను అదుపులోకి (Law and Order) తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఘటనలో ఉపయోగించిన మారుతీ 800 కారు, చెక్క కర్ర, ఐఫోన్ మొబైల్ తో పాటు ఘటనాస్థలంలోని ఇతర ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను న్యాయస్థానం (Kamareddy Court) ఎదుట హాజరుపరచనున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: ఓటరు జాబితా సవరణపై మంత్రి పొన్నం కీలక సూచనలు