వరంగల్Warangal Congress Unity | వరంగల్​ కాంగ్రెస్​లో కీలక పరిణామం.. ఒక్కటైన నేతలు

Warangal Congress Unity | వరంగల్​ కాంగ్రెస్​లో కీలక పరిణామం.. ఒక్కటైన నేతలు

ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్​ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వర్గపోరు పక్కన పెట్టి నేతలంతా ఒకచోట సమావేశం అయ్యారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Warangal Congress Unity | ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్​ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కొంతకాలంగా వర్గపోరుతో విమర్శలు చేసుకుంటున్న నాయకులు ఒక్కటయ్యారు.

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్​ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ నాయకుల ఆత్మీయ సమావేశం జరిగింది. క్షేత్రస్థాయి నాయకుల నుండి సీనియర్ నాయకత్వం వరకు అందరు హాజరు అయ్యారు. జిల్లాలో కాంగ్రెస్‌ను బలోపేతం చేయడం, ప్రతిపక్షాన్ని దీటుగా ఎదుర్కోవడం ఎలా అని చర్చించారు. ఈ సమావేశంలో మంత్రి సురేఖ (Minister Surekha)తో పాటు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Warangal Congress Unity | ఆసక్తికరం..

వరంగల్​ (Warangal) రాజకీయాల్లో కొంతకాలంగా వర్గపోరు నెలకొంది. ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ, ఇతర ఎమ్మెల్యేలకు పడటం లేదు. మంత్రి భర్త కొండా మురళి పలుమార్లు ఇతర నాయకులుపై విమర్శలు చేశారు. ఈ విషయం కాంగ్రెస్​ అధిష్టానం, క్రమశిక్షణ కమిటీ వరకు వెళ్లింది. ముఖ్యంగా కొండా మురళి కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్​రెడ్డిపై విమర్శలు చేశారు. అంతేగాకుండా ఆయన కుమార్తె పరకాల నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. అక్కడ ఇప్పటికే కాంగ్రెస్​ ఎమ్మెల్యే ప్రకాశ్​రెడ్డి ఉన్నారు. దీంతో కొండా కుటుంబానికి, ఇతర ఎమ్మెల్యేలకు దూరం పెరిగింది. ఈ క్రమంలో అందరు నేతలు ఒకచోట సమావేశం కావడం ఆసక్తికరంగా మారింది.

Warangal Congress Unity | మున్సిపల్ ఎన్నికల కోసం..

గ్రేటర్​ వరంగల్​ కార్పొరేషన్​ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కీలకమైన వరంగల్​ కార్పొరేషన్​ను దక్కించుకోవాలని కాంగ్రెస్​ భావిస్తోంది. అయితే వర్గపోరు నేపథ్యంలో పార్టీ నష్టం వాటిల్లే అవకాశం ఉండటంతో అందరు నేతలు కలిసి పని చేయాలని పార్టీ పెద్దలు సూచించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే నాయిని రాజేందర్​ రెడ్డి నివాసంలో వరంగల్ నాయకుల సమావేశం జరిగింది.

ఇది కూడా చదవండి..: RI Caught by ACB | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్​ఐ

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Kamareddy Property Tax | భువన్ సర్వేతో బయటపడ్డ కామారెడ్డి ఆస్తిపన్ను బకాయిలు

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Property Tax | కామారెడ్డి పురపాలక సంఘంలో...

MP Anil kumar | ఎంపీ అర్వింద్ వడదెబ్బ తగిలి మాట్లాడుతుండు: ఎంపీ అనిల్​కుమార్​ యాదవ్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : MP Anil kumar | నిజామాబాద్​ ఎంపీ...

Kamareddy Water Supply | నీటి సమస్య తీర్చిన ఘనత షబ్బీర్ అలీదే..: మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Water Supply |కామారెడ్డిలో దశాబ్దాలుగా వేధిస్తున్న తాగునీటి...

Telangana IAS Officers| జాతీయ స్థాయిలో తెలంగాణ ఐఏఎస్ అధికారుల హవా.. ‘టాప్ 100’ జాబితాలో ముగ్గురికి చోటు

అక్షరటుడే వెబ్‌డెస్క్:Telangana IAS Officers|తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసెస్‌కు జాతీయ స్థాయిలో అరుదైన...