అక్షరటుడే,మెండోరా: Chief Election Commissioner Resignation | కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు.
Chief Election Commissioner Resignation | దిష్టిబొమ్మ దహనం..
మండల పార్టీ అధ్యక్షుడు సాయిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల కమిషనర్ బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా 13 కోట్లకు పైగా, తెలంగాణలో సుమారు 90 లక్షల ఓట్లు తొలగించారని పేర్కొంటూ, ఓటర్ల జాబితా వ్యవహారంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉందని విమర్శించారు.
Chief Election Commissioner Resignation | కాంగ్రెస్ అగ్ర నేతల అరెస్టుపై విచారం..
కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ (Rahul Gandhi), ప్రియాంక గాంధీ కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా పోరాడుతున్న నేపథ్యంలో వారిని అరెస్టు చేయడం బాధాకరమని నగేష్ రెడ్డి అన్నారు. ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ జిల్లా పీసీసీ ఆదేశాల మేరకు మండల కేంద్రాల్లో ధర్నాలు, దిష్టిబొమ్మల దహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో గ్రామస్థాయిలోనూ ఆందోళనలు చేపడతామని, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీనామా చేసే వరకు ఏఐసీసీ, పీసీసీ ఆదేశాల మేరకు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, రైతు భరోసా, వరికి రూ.500 బోనస్ వంటి పథకాలను ఆయన ప్రస్తావించారు. ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని తప్పుబట్టారు.
Chief Election Commissioner Resignation |బాల్కొండ ఎమ్మెల్యే ఏం చేశాడు..
బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏమిటో వివరించాలని ప్రశ్నించారు. భీమ్గల్లో బస్స్టాండ్ నిర్మాణం చేపట్టలేదని విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి కాంగ్రెస్ను విమర్శిస్తున్నాయని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు చాట్ల నరేష్, కౌడప్ శరత్, వెంకట్ రామ్ రెడ్డి, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు యాదగిరి, మెండోరా మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యం రెడ్డి, ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, ముప్కల్ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్, మెండోరా మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్, సోం రాజేందర్, నోముల రాజన్న, జిల్లా పార్టీ కార్యదర్శి నోముల శ్రీనివాస్, గణేష్, బద్దం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Hyderabad Kidnap Case | హైదరాబాద్లో వ్యాపారవేత్త కిడ్నాప్