Navi Pillay Nobel Peace Prize | ట్రంప్‌నకు మళ్లీ నిరాశే.. నవీ పిళ్లైకి నోబెల్ శాంతి బహుమతి

‘నేడు ఎనిమిది యుద్ధాలు ఆపాను.. నాకే నోబెల్​ శాంతి బహుమతి రావాలి’ అని చెప్పిన ట్రంప్​నకు మరోసారీ నిరాశే ఎదురైంది.

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Navi Pillay Nobel Peace Prize | ‘నేడు ఎనిమిది యుద్ధాలు ఆపాను.. నాకే నోబెల్​ శాంతి బహుమతి రావాలి’ అని చెప్పిన ట్రంప్ (Trump)​నకు మరోసారీ నిరాశే ఎదురైంది. భారత మూలాలున్న మహిళకు ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి దక్కింది. 2026 ఏడాదికి సంబంధించిన నోబెల్ శాంతి పురస్కారం దక్షిణాఫ్రికాకు చెందిన నవనీతమ్ ‘నవీ’ పిళ్లైను వరించింది.

Navi Pillay Nobel Peace Prize | నోబెల్ కమిటీ ప్రకటన

నార్వే రాజధాని ఓస్లోలో నోబెల్ కమిటీ నవీ పిళ్లైకి ఈ అవార్డును ప్రకటించింది. అంతర్జాతీయ శాంతి, న్యాయ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఆమె చేసిన కృషికి గాను ఈ గౌరవం దక్కింది. నవీ పిళ్లై 2008 నుంచి 2014 వరకు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్‌గా పనిచేసింది.

Navi Pillay Nobel Peace Prize | క్రిమినల్ ట్రిబ్యునల్ అధ్యక్షురాలిగా..

నవనీతమ్ రువాండా అంతర్జాతీయ క్రిమినల్ ట్రిబ్యునల్ అధ్యక్షురాలిగా, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు న్యాయమూర్తిగా సేవలందించారు. యుద్ధ నేరాలకు పాల్పడినవారిని బాధ్యులుగా నిలబెట్టడంతో పాటు బాధితులకు న్యాయం అందించడం వంటి అంశాల్లో ఆమె కృషిని నోబెల్ కమిటీ గుర్తించింది. ఈ ఏడాది శాంతి పురస్కారం కోసం మొత్తం 287 నామినేషన్లు వచ్చిన విషయం తెలిసిందే.

ఇది కూడా చదవండి..: US Green Card Suspension | అమెరికా షాకింగ్​ నిర్ణయం.. భారత ఐటీ కంపెనీలపై సస్పెన్షన్​

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *