Putin Russia Challenges | ఉక్రెయిన్ యుద్ధంతో కష్టకాలం : రష్యా అధ్యక్షుడు పుతిన్

దేశ భద్రత, ప్రజల రక్షణ, రష్యా సరిహద్దుల సమగ్రతను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పుతిన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న సమస్యలన్నింటిపై ప్రభుత్వం అప్రమత్తంగా స్పందిస్తోందని తెలిపారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Putin Russia Challenges | ఉక్రెయిన్‌తో కొనసాగుతున్న యుద్ధం, పశ్చిమ దేశాల ఆంక్షల నేపథ్యంలో రష్యా ప్రస్తుతం కష్టకాలాన్ని ఎదుర్కొంటోందని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. అయితే ఈ సవాళ్లన్నింటినీ రష్యా తప్పకుండా అధిగమిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

సెప్టెంబర్‌లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ యునైటెడ్ రష్యా సమావేశంలో ఆదివారం ప్రసంగించిన పుతిన్.. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న పరిస్థితులు తమకు ఎన్నో పాఠాలు నేర్పాయని పేర్కొన్నారు. కష్టకాలం దేశాన్ని మరింత బలంగా మార్చిందని ఆయన వ్యాఖ్యానించారు.

Telangana Telugu History | ఆంధ్రుల భాష ‘ఆంధ్రం’… మనది ‘జాన తెలుగు’!: “ఇడుపు కాయితం” Title లొల్లి వేళ ఆకట్టుకుంటున్న ప్రొఫెసర్ దంటు కనకదుర్గ విశ్లేషణ

Putin Russia Challenges | సవాళ్లను అధిగమిస్తాం

దేశ భద్రత, ప్రజల రక్షణ, రష్యా సరిహద్దుల సమగ్రతను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పుతిన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న సమస్యలన్నింటిపై ప్రభుత్వం అప్రమత్తంగా స్పందిస్తోందని తెలిపారు.

ఉక్రెయిన్ దాడుల నేపథ్యంలో రష్యా భూభాగం, కీలక మౌలిక సదుపాయాలపై జరుగుతున్న ఉగ్రదాడులు సహా అన్ని సవాళ్లను తప్పకుండా అధిగమిస్తామని పుతిన్ ధీమా వ్యక్తం చేశారు.

ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో రష్యాపై పశ్చిమ దేశాలు విధించిన ఆర్థిక ఆంక్షలు, డ్రోన్, క్షిపణి దాడులు దేశంపై ప్రభావం చూపుతున్న వేళ పుతిన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *