Ananya Nagalla | ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్‌పై అనన్య నాగళ్ల స్పందన.. “డబ్బు కాదు, కమ్యూనిటీ కోసం”

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ananya Nagalla | సోషల్ మీడియా యుగంలో సెలబ్రిటీలు తమ ఆదాయ మార్గాలను విస్తరించుకుంటున్న తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా హీరోయిన్లు సినిమాలకు మాత్రమే పరిమితం కాకుండా, ఇన్‌స్టాగ్రామ్ (Instagram) వంటి ప్లాట్‌ఫామ్స్ ద్వారా అభిమానులతో కనెక్ట్ అవుతూ, అదే సమయంలో ఆదాయం పొందుతున్నారు. ఈ ట్రెండ్‌లో తాజాగా తెలుగు నటి అనన్య నాగళ్ల కూడా చేరింది.

సోషల్ మీడియా (Social Media)లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అనన్య, తన గ్లామరస్ ఫొటోలు, వీడియోలతో ఇప్పటికే మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో Instagram Account సబ్‌స్క్రిప్షన్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా ఆమె ఎక్స్‌క్లూజివ్ కంటెంట్‌ను చూడాలంటే ఫాలోవర్స్ నెలకు రూ.390 చెల్లించి సబ్‌స్క్రైబ్ కావాల్సి ఉంటుంది.

Ananya Nagalla | అస‌లు విష‌యం ఇది..

అంటే, సాధారణ ఫాలోవర్లకు కనిపించని ప్రత్యేక ఫోటోలు, వ్యక్తిగత విషయాలు, వీడియోలు వంటి కంటెంట్‌ను కేవలం సబ్‌స్క్రైబర్లకే పరిమితం చేసింది. దీంతో కొంతమంది నెటిజన్లు విమర్శలు చేయడం ప్రారంభించారు. “డబ్బు కోసం ఇలా చేస్తున్నారా?” అనే ప్రశ్నలు కూడా లేవనెత్తారు. ఈ విమర్శల నేపథ్యంలో అనన్య నాగళ్ల స్పందించింది. తాను ఈ సబ్‌స్క్రిప్షన్ ఫీచర్‌ను 2025లోనే ప్రారంభించానని, అయితే దీనిపై ఇప్పుడు అనవసర వ్యాఖ్యలు వస్తున్నాయని చెప్పింది. దీనికి సంబంధించి ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఉద్దేశాన్ని వివరించింది. నేను ఈ సబ్‌స్క్రిప్షన్ ప్రారంభించిన కారణం డబ్బు సంపాదించడం మాత్రమే కాదు. నా ఫాలోవర్లతో రెగ్యులర్‌గా కనెక్ట్ అవ్వాలని, ఒక కమ్యూనిటీలా (Community) కలిసి ఉండాలని అనుకున్నాను. నా జీవితంలో ఎదురైన అనుభవాలను మీతో పంచుకోవాలని, మీ నుంచి నేర్చుకోవాలని ఉంది అని ఆమె తెలిపింది.

heroine

Ananya Nagalla | ఆధ్యాత్మికతపై..

సమాజానికి కలిసి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించాలనుకుంటున్నానని పేర్కొంది అనన్య. తన వీడియోలో ఆమె ఆధ్యాత్మిక విషయాలపై కూడా మాట్లాడింది. “ఓం నమః శివాయ” మంత్రాన్ని 21 రోజులు, రోజుకు 108 సార్లు జపిస్తే మనసుకు ప్రశాంతత లభిస్తుందని చెప్పింది. మొత్తానికి సోషల్ మీడియా ద్వారా ఆదాయం పొందడంపై వచ్చిన విమర్శలకు అనన్య నాగళ్ల తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. అయితే ఆమె వివరణ తర్వాత ఈ వివాదం చల్లారుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది.

ఇది కూడా చదవండి : Cyber Fraud | సైబర్​ దొంగల్లో బ్యాంక్​ అధికారులు.. 52 మంది నిందితుల అరెస్ట్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *