అక్షరటుడే, వెబ్‌డెస్క్ : LPG Price Hike | దీపావళి (Diwali) పండుగ ముందు చమురు సంస్థలు వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచాయి. సిలిండర్‌పై ఢిల్లీలో రూ.10 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఆదివారం (నవంబర్ 1) నుంచి ఈ పెంపు అమలులోకి వచ్చింది.
దేశవ్యాప్తంగా 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను చమురు సంస్థలు పెంచాయి. ఢిల్లీలో సిలిండర్ ధర రూ.10 పెరిగి రూ.2,820కి చేరింది. కోల్‌కతాలో రూ.17, చెన్నైలో రూ.11.50 మేర అదనపు భారం పడింది. వరుసగా మూడో నెల కమర్షియల్ గ్యాస్ ధరలు పెరగడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార పదార్థాల ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ ధరలు యథాతథంగా ఉన్నాయి.
LPG Price Hike | మూడో సారి పెంపు..
సెప్టెంబర్ నుంచి వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు పెరుగుతున్నాయి. సెప్టెంబర్‌లో రూ.10 చొప్పున, అక్టోబర్ 1న రూ.65 చొప్పున చమురు సంస్థలు సిలిండర్ల ధరలు పెంచాయి. తాజాగా మరో రూ.10 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో వినియోగదారులపై తీవ్ర ప్రభావం పడుతోంది. మరోవైపు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరలు సైతం పెరిగాయి. లీటరుకు రూ.1.37 పెరిగింది. దీనితో ఇప్పుడు లీటరు ధర రూ.138.5కి చేరింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గకపోవడం, చమురు రవాణాలో ఇబ్బందుల నేపథ్యంలో ఆయిల్ కంపెనీలు ధరలను పెంచాయి.
దీనిని కూడా చదవండి : Choutuppal Murder Case | చౌటుప్పల్‌లో జోగిని దారుణ హత్య.. 60 తులాల బంగారం చోరీ