అక్షరటుడే, రాజన్న సిరిసిల్ల: Voter Rights Protection | అర్హులైన ఏ ఒక్క ఓటరూ తమ ఓటు హక్కును కోల్పోవద్దని ఎన్నికల జాబితా రాష్ట్ర పరిశీలకులు, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమయాదేవి ఆదేశించారు. కలెక్టరేట్లో పాలనాధికారి గరిమ అగ్రవాల్ (Garima Agrawal)తో కలిసి అధికారులు, వివిధ పార్టీల నాయకులతో సమీక్షంచారు.
Voter Rights Protection | ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకం..
ఈ సందర్భంగా ఎన్నికల జాబితా రాష్ట్ర పరిశీలకులు, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమయాదేవి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమని స్పష్టం చేశారు. ఓటు హక్కు దుర్వినియోగాన్ని అరికట్టడం ఎంత ముఖ్యమో.. అర్హులైన ఒక్క ఓటరూ ఓటు హక్కును కోల్పోకుండా చూడటం అంతే ముఖ్యమని స్పష్టం చేశారు. జిల్లాలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ను అభినందించారు. ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.
Voter Rights Protection | ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా..
భారత ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ముందుకు వెళ్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. అర్హుల ఓటు హక్కు కోల్పోకుండా అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గడువులోగా ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. సమీక్ష అనంతరం రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు, జిల్లా కలెక్టర్ తో కలిసి సిరిసిల్ల నియోజకవర్గంలోని సిరిసిల్ల మున్సిపల్ పరిధి శాంతినగర్‌లోని పోలింగ్ కేంద్రం నెంబర్ 1,105లో రికార్డులు పరిశీలించారు. ఫారం -6, 7 ఇతర దరఖాస్తులపై ఆరా తీశారు. ఆన్లైన్లో వివరాల నమోదు ను పరిశీలించారు. హెల్ప్ డెస్క్‌లో సిబ్బంది, రిజిస్టర్లో ఫిర్యాదుల నమోదు, పరిష్కారంపై ఆరా తీశారు. సమావేశంలో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు శ్రీధర్ బాబు, కే ఎస్ బీ కుమారి, ఏఈఆర్ఓలు, కలెక్టరేట్ పర్యవేక్షకులు ఉమారాణి, ఎన్నికల విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Chakratheertham Festival | భక్తిశ్రద్ధలతో చక్రతీర్థం.. లింబాద్రిగుట్టపై ఆధ్యాత్మిక శోభ