Laksettipet Incident | లక్షెట్టిపేటలో విషాదం.. షెడ్డు కూలి నలుగురు రైతుల మృతి

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Laksettipet Incident | మంచిర్యాల జిల్లా (Mancherial District) లక్షెట్టిపేటలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భారీ ఈదురుగాలులకు రేకుల షెడ్డు కూలి నలుగురు రైతులు మృతి చెందారు.

లక్షెట్టిపేటలో బుధవారం తెల్లవారుజామున ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షం కురిసింది. దీంతో ధాన్యం ఆరబోసిన రైతులు పంట కాపాడుకోవడానికి వెళ్లారు. అయితే వర్షం ఎక్కువ కావడంతో సమీపంలోని ఓ ఫంక్షన్​ హాల్​ షెడ్​ కిందకు పరుగు తీశారు. ఈదురుగాలులకు ఫంక్షన్​ హాల్​ షెడ్​ కూలిపోయింది. దీంతో నలుగురు రైతులు (Farmers) మృతి చెందారు.

Laksettipet Incident | తండ్రీకుమారుడు మృతి

ప్రమాదంలో లక్షెట్టిపేటకు చెందిన నెల్కి లచ్చన్న, గుండారపు వెంకటేశ్, తనుగుల అభిరామ్, తనుగుల నాగరాజు చనిపోయారు. మరికొంత మంది రైతులు గాయపడ్డారు. ఇందులో సీదుల హరీశ్ పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్‌ ఆస్పత్రి (Karimnagar Hospital)కి తరలించారు. మృతుల్లో అభిరామ్​, నాగరాజ్​ తండ్రీ కొడుకులు కావడం గమనార్హం. ధాన్యం కాపాడుకోవడానికి వెళ్లి నలుగురు రైతులు చనిపోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. పలు ప్రాంతాల్లో ఈదురుగాలుల ధాటికి చెట్లు, కరెంట్ స్తంభాలు విరిగిపడ్డాయి. కల్లాల్లో ధాన్యం తడిసిపోవడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: AI Education Telangana | పాఠశాల, సాంకేతిక, వైద్య విద్యల్లో ఏఐ వినియోగంపై ఉన్నతస్థాయి కమిటీ : సీఎం రేవంత్​ 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *