Chakratheertham Festival | భక్తిశ్రద్ధలతో చక్రతీర్థం.. లింబాద్రిగుట్టపై ఆధ్యాత్మిక శోభ

నింబాచల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం చక్రతీర్థం కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, భీమ్‌గల్: Chakratheertham Festival | నింబాచల లక్ష్మీనరసింహస్వామి (Nimbacha Lakshmi Narasimha Swamy) ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం చక్రతీర్థం శాస్త్రోక్తంగా నిర్వహించారు. మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల మధ్య జరిగిన పూజలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.

Chakratheertham Festival | కల్యాణ మండపం నుంచి..

కల్యాణ మండపం నుంచి స్వామివారి ఉత్సవమూర్తులతో పాటు శ్రీ చక్రస్వామిని ప్రత్యేకంగా అలంకరించి మాడ వీధుల గుండా ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకెళ్లారు. కోనేటి మండపంలో ఉత్సవమూర్తులను కొలువుదీర్చి పాలు, తేనె, గంధం, పసుపు, నెయ్యి తదితర ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం పుష్పాలంకరణ, హారతి సమర్పించారు. అంతకుముందు ఆలయంలో శేష హోమం, భాగవత ఫలశ్రుతి, పూర్ణాహుతి కార్యక్రమాలు జరిపారు. చక్రతీర్థం సందర్భంగా లోకక్షేమం, సకల జనుల శాంతి, సౌభాగ్యం కలగాలని భక్తులు ప్రార్థించారు.

ఇది కూడా చదవండి..: POCSO Case Verdict | పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *