అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: POCSO Case Verdict | పోక్సో కేసులో నిందితుడికి 20ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. ఈమేరకు సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) వివరాలు వెల్లడించారు.
POCSO Case Verdict | ఎడపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో..
ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో బాధితుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేశారు. అనంతరం ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ జడ్జి ఫర్ పోక్సో కోర్టు (ఇన్‌ఛార్జి ఉమెన్స్ కోర్టు) విచారించి బాలికలను వేధించిన కేసులో ఎడపల్లి మండలం జానకంపేట్కు చెందిన నిందితుడు నారాయణకు 20ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. అలాగే బాధిత బాలికలకు రూ.16లక్షల పరిహారం అందించాలని తీర్పునిచ్చారు. పోక్సో కోర్టు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం.నీరజా రెడ్డి కేసును వాదించారు.
ఇది కూడా చదవండి..: Paddy Procurement Delay | ధాన్యం కొనుగోళ్లు ఎప్పుడో..? కేంద్రాల జాడలేక డీలాపడ్డ రైతన్న