Gandhari Woman Murder | గాంధారిలో దారుణం.. పెళ్లి పత్రిక ఇద్దామని వచ్చిన యువతి హత్య..

పెళ్లి పత్రిక ఇద్దామని సొంతూరుకు వచ్చిన యువతి దారుణ హత్యకు గురైంది.

shashi kiran Mottala

అక్షరటుడే, గాంధారి: Gandhari Woman Murder | పెళ్లి పత్రిక ఇద్దామని సొంతూరుకు వచ్చిన యువతి దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన గాంధారి మండలంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది.

Gandhari Woman Murder | హైదరాబాద్​ నుంచి వచ్చిన యువతి..

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధారి మండలం (Gandhari Mandal)లోని అంగడి బజార్ సెల్ టవర్ వద్ద నివాసముండే సిక్కు మతానికి చెందిన యువతి ఆర్​సీ కౌర్​ జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్​లో నివసిస్తోంది. అయితే ఇటీవల ఆమెకు పెళ్లి సంబంధం కుదరగా.. పెళ్లిపత్రిక ఇచ్చేందుకు సొంతూరైన గాంధారికి శుక్రవారం వచ్చింది. అయితే రాత్రి సమయంలో సెల్ టవర్ దగ్గర గుర్తుతెలియని వ్యక్తులు అతిదారుణంగా ఆమెను హత్య చేసినట్లు ఎస్సై మహేందర్​ తెలిపారు. సంఘటనా స్థలానికి ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్​ చేరుకుని విచారణ చేశారని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

67

ఇది కూడా చదవండి..: Police Save Man | పోలీసుల సమయస్ఫూర్తి..ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి సురక్షితం!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *