అక్షరటుడే, వెబ్‌డెస్క్: E20 Petrol Controversy | కర్ణాటక (Karnataka)లోని కొన్ని అవుట్లెట్లలో విక్రయించే పెట్రోల్‌లో 31 శాతం వరకు ఇథనాల్ ఉందని ప్రభుత్వం పేర్కొంది. అయితే ఈ వాదనను ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఖండించాయి.
ఆయిల్ కంపెనీలు 20 శాతం పరిమితికి మించి ఇథనాల్ కలిగిన పెట్రోల్‌ను సరఫరా చేస్తున్నాయని ప్రభుత్వం ఆరోపించారు. పరీక్షలలో దీని స్థాయి 31.2 శాతం వరకు నమోదైందని పేర్కొంది. బెంగళూరు, కోలార్, చిక్కబళ్లాపుర, బెంగళూరు రూరల్, రామనగర, మంగళూరు, తుమకూరుల నుంచి సేకరించిన పెట్రోల్‌ను పరీక్షించగా.. 31శాతం వరకు ఇథనాల్ ఉందని తెలిపింది. దీనిపై ఆయిల్ సంస్థలు స్పందించాయి. ప్రభుత్వ వాదనను ఖండించాయి. ఆ ఆరోపణలకు సాంకేతిక ప్రక్రియలకు అనుగుణంగా నిర్వహించిన పరీక్షల మద్దతు లేదని చెప్పాయి.
E20 Petrol Controversy | దేశవ్యాప్తంగా..
కర్ణాటకతో సహా దేశవ్యాప్తంగా తాము సరఫరా చేసిన E20 పెట్రోల్, ఇథనాల్ కలిపిన మోటార్ గ్యాసోలిన్ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిర్దేశించిన IS 17021 ప్రమాణాలకు అనుగుణంగా ఉందని ఆ కంపెనీలు తెలిపాయి. కర్ణాటక ప్రభుత్వం ప్రమాణాల మేరకు పరీక్షలు నిర్వహించలేదని పేర్కొన్నాయి. నిర్దేశించిన ప్రయోగశాలలో కాకుండా, ఒక థర్డ్-పార్టీ ప్రయోగశాలలో పరీక్షలు చేశారని తెలిపాయి.
ఇది కూడా చదవండి..: Karmabhoomi Express Fire | కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం.. 5 భోగీలు దగ్ధం