అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Jail Superintendent | నిజామాబాద్ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్‌గా కళాసాగర్ నియమితులయ్యారు. ఈ మేరకు జైళ్లశాఖ డీజీ సౌమ్యా మిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు.
Jail Superintendent | వరంగల్ సెంట్రల్ జైలు నుంచి..
వరంగల్ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్‌గా విధుల్లో ఉన్న కళాసాగర్ను నిజామాబాద్ (Nizamabad)కు బదిలీ చేశారు. అలాగే గతంలో జిల్లా జైలులో సూపరింటెండెంట్‌గా పనిచేసి ప్రస్తుతం పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న దశరథంను వరంగల్ జైలు సూపరింటెండెంట్ బాధ్యతలు అప్పజెప్పారు. చర్లపల్లి జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ వెంకటేశంను కరీంనగర్ జైలుకు అక్కడ విధుల్లో ఉన్న విజయ్ను చర్లపల్లికి బదిలీ చేశారు. ఈ అదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని డీజీ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి..: Gandhari Woman Murder | గాంధారిలో దారుణం.. పెళ్లి పత్రిక ఇద్దామని వచ్చిన యువతి హత్య..