Cannabis Cultivation | 458 ఎకరాల్లో గంజాయి సాగు.. ధ్వంసం చేసిన అధికారులు

అరుణాచల్ ప్రదేశ్‌లో 458 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేస్తున్న గంజాయి మొక్కలను పోలీసులు ధ్వంసం చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cannabis Cultivation | ఈశాన్య రాష్ట్రాల్లో గంజాయి దందా జోరుగా సాగుతోంది. కొండ ప్రాంతాల్లో కొందరు భారీగా గంజాయి సాగు చేస్తున్నారు. అనంతరం దానిని దేశంలోని పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. ఇటీవల అధికారులు, పోలీసులు భారీ ఆపరేషన్​ చేపట్టి అరుణాచల్​ ప్రదేశ్​లో గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు.

Cannabis Cultivation | భారీ ఆపరేషన్​

అరుణాచల్ ప్రదేశ్‌ (Arunachal Pradesh)లోని వెస్ట్ కామెంగ్ జిల్లా కలక్తాంగ్ సబ్-డివిజన్‌లో సుమారు 458 ఎకరాల విస్తీర్ణంలో గంజాయి సాగు చేస్తున్నారు. పక్కా సమాచారం అధికారులు భారీ ఆపరేషన్​ చేపట్టారు. అక్టోబర్ 26 నుండి నవంబర్ 3 వరకు చేపట్టిన ఆపరేషన్​లో 1.37 లక్షల కిలోలకు పైగా గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB), ఇటానగర్ జోనల్ యూనిట్, SSB, CRPF మరియు అరుణాచల్ ప్రదేశ్ పోలీసులు ఈ ఆపరేషన్​లో పాల్గొన్నారు. కామెంగ్ పోలీసులు & జిల్లా యంత్రాంగం నిర్వహించిన క్షేత్రస్థాయి సర్వేలు మరియు NCB అందించిన శాటిలైట్ చిత్రాల సహాయంతో గంజాయి సాగు చేస్తున్న ప్రాంతాలను గుర్తించారు.

ఇది కూడా చదవండి..: E20 Petrol Controversy | కర్ణాటకలో ఈ 20 పెట్రోల్​పై వివాదం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *