Assembly election polling | తమిళనాడు, పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

Naresh Chandan
Assembly election polling

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Assembly election polling | తమిళనాడు Tamil Nadu, పశ్చిమబెంగాల్ West Bengal రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

కాగా, ఈ స్థానాలన్నింటికి ఒకే దశలో ఓటింగ్ జరుగుతోంది. ఇక పశ్చిమబెంగాల్‌లో రెండు విడతల్లో కొనసాగనుండగా.. మొదటి దశలో నేడు 152 స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది.

Assembly election polling | విస్తృత ఏర్పాట్లు..

రెండు రాష్ట్రాల్లోనూ ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం Central Election Commission విస్తృత ఏర్పాట్లు పూర్తి చేసింది. భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసింది. పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని సౌకర్యాలు కల్పించింది.

తమిళనాడులో అన్నాడీఎంకే–బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి, డీఎంకే–కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండి కూటమి, టీవీకే మధ్య త్రికోణ పోటీ నెలకొంది. ఇక పశ్చిమబెంగాల్‌లో టీఎంసీ, బీజేపీ మధ్య నేరుగా పోటీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

ఇది కూడా చదవండి: Vijayawada college harassment | ఆయుర్వేద కళాశాలలో లైంగిక వేధింపుల కలకలం

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *