అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad Red Cross Society | జిల్లాలో రెడ్‌క్రాస్ సొసైటీ అభివృద్ధికి కృషి చేస్తానని టీపీసీసీ చీఫ్ (TPCC Chief) బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్ (Bomma Mahesh Kumar Gou) అన్నారు. ఇటీవల నూతనంగా ఎన్నికైన రెడ్‌క్రాస్ సొసైటీ (Red Cross Society) కార్యవర్గ సభ్యులు గురువారం ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో ఆయనను కలిసి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.
Nizamabad Red Cross Society | రాజకీయాలకు అతీతంగా..
పీసీసీ చీఫ్ మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా.. ప్రజాసేవే లక్ష్యంగా రెడ్‌క్రాస్ సొసైటీ అభివృద్ధికి తన సహకారం ఉంటుందన్నారు. సొసైటీని ఓసారి సందర్శించాలని ప్రతినిధులు కోరగా.. తప్పకుండా రెడ్‌క్రాస్ భవనాన్ని సందర్శిస్తానన్నారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సొసైటీ ఛైర్మన్ పోతన్కర్ లక్ష్మీనారాయణ, వైస్ ఛైర్మన్ డాక్టర్ సీను నాయక్, ట్రెజరర్ కెంపుల నాగరాజు, ఎగ్జిక్యూటివ్ సభ్యులు రంజిత్ సింగ్, జగన్ మోహన్ గౌడ్, సభ్యులు పద్మ, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి : ఏఐతో అసెంబ్లీ పేల్చివేత.. సీన్ కట్ చేస్తే జైలుకు..!