అక్షరటుడే వెబ్‌డెస్క్: Andhra Pradesh Cyclone Alert | ఆంధ్రప్రదేశ్‌ను మరో రెండు తుఫాన్ల ముప్పు వెంటాడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే వరుస ప్రకృతి విపత్తుల నుంచి తేరుకోకముందే, నవంబర్ చివరి వారంలో ఒకటి, డిసెంబర్ రెండో వారంలో మరొకటి చొప్పున బంగాళాఖాతంలో ( Bay of Bengal )అల్పపీడనాలు ఏర్పడే సంకేతాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. నవంబర్ 26 తర్వాత దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
Andhra Pradesh Cyclone Alert | తుఫానుగా మారుతుందా?
నవంబర్ 26 తర్వాత ఏర్పడే ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారి, ఆపై తుఫానుగా బలపడుతుందా లేదా అన్న విషయంలో ఇప్పుడే స్పష్టమైన అంచనాకు రాలేమని నిపుణులు తెలిపారు. వాతావరణ పరిస్థితులు, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల ఆధారంగానే దీని తీవ్రత తెలుస్తుందని చెప్పారు.
Andhra Pradesh Cyclone Alert | గత తుఫాన్ల నష్టం..
ఈ ఏడాది సూపర్ ఎల్నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తుండటంతో శీతాకాలం ప్రారంభంలోనే తుఫాన్ల సంఖ్య పెరుగుతోందని విశ్లేషకులు వివరించారు. గతంలో ఆర్నాబ్, మొరసు తుఫాన్ల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పుడు కొత్తగా ఏర్పడే వాతావరణ వ్యవస్థలపై వాతావరణ శాఖ నిరంతరం నిఘా ఉంచింది.
Andhra Pradesh Cyclone Alert |రైతులకు సూచనలు..
బంగాళాఖాతంలో వరుస మార్పుల నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు, రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచించారు. ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ జారీ చేసే హెచ్చరికలు, సూచనలను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
ఇది కూడా చదవండి: Paddy Procurement Delay | ధాన్యం కొనుగోళ్లు ఎప్పుడో..? కేంద్రాల జాడలేక డీలాపడ్డ రైతన్న