Nadendla Bhaskara Rao | మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nadendla Bhaskara Rao | ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు(90) కన్నుమూశారు. కొన్ని రోజులుగా హైదరాబాద్ (Hyderabad)​లో చికిత్స పొందుతున్న ఆయన నేడు తుది శ్వాస విడిచారు.

నాదెండ్ల భాస్కర్​ రావు వయో సంబంధిత సమస్యలతో కాంటినెంటల్ హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన పార్థివదేహాన్ని జూబ్లీహిల్స్ (Jubilee Hills)​లోని నివాసంలో ఉంచనున్నారు. పంజాగుట్ట హిందూ శ్మశానవాటికలో గురువారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Nadendla Bhaskara Rao | నెల రోజులు సీఎంగా..

నాదెండ్ల భాస్కర రావు 1935 జూన్​ 23న జన్మించారు. కాంగ్రెస్​ నుంచి ఆయన తన రాజకీయ జీవితాన్ని ఆరంభించారు. 1978లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అనంతరం చెన్నారెడ్డి (Chennareddy) మంత్రివర్గంలో పని చేశారు. తర్వాత ఎన్​టీఆర్​ టీడీపీ (TDP) ఏర్పాటు సమయంలో నాదెండ్ల కాంగ్రెస్​ను వీడారు. తెలుగు దేశం ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. 1983లో టీడీపీ గెలిచిన అనంతరం ఆయన ఆర్థిక మంత్రిగా పని చేశారు. అయితే 1984లో అప్పటి సీఎం ఎన్టీఆర్​ ఆపరేషన్​ కోసం అమెరికా వెళ్లారు. ఆ సమయంలో నాదెండ్ల కాంగ్రెస్​తో కలిసి ఎన్​టీఆర్​పై తిరుగుబాటు చేశారు. పార్టీని చీల్చి కాంగ్రెస్​ సాయంతో సీఎం అయ్యారు. అనంతరం ఎన్టీఆర్​ పెద్ద ఎత్తున ఉద్యమం చేయడంతో నాదెండ్ల రాజీనామా చేశారు. దాదాపు నెల రోజులు ఆయన సీఎంగా వ్యవహరించారు.

bhaskar rao

Nadendla Bhaskara Rao | కాంగ్రెస్​లోకి..

ఎన్టీఆర్​ మళ్లీ సీఎం అయ్యాక.. నాదెండ్లను టీడీపీ నుంచి బహిష్కరించారు. దీంతో ఆయన కాంగ్రెస్​లో చేరారు. 1989లో తెనాలి ఎమ్మెల్యేగా, 1998 ఖమ్మం ఎంపీగా గెలిచారు. తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయన కుమారుడు నాదెండ్ల మనోహర్​ గతంలో కాంగ్రెస్​లో ఉన్నారు. జనసేన ఏర్పాటులో ఆయన కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం ఏపీ మంత్రిగా పని చేస్తున్నారు.

దీనిని కూడా చదవండి : Chandrababu Comments | రేవంత్​రెడ్డికి అవగాహన లేదు.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *