Konda Surekha | మంత్రి కొండా సురేఖపై చర్యలు తప్పవా.. పీసీసీ చీఫ్​ కీలక వ్యాఖ్యలు

మంత్రి కొండా సురేఖపై అధిష్టానం సీరియస్​ ఉందని పీసీసీ చీఫ్​ మహేశ్​ గౌడ్​ పేర్కొన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Konda Surekha | మంత్రి కొండా సురేఖపై చర్యలకు కాంగ్రెస్​ అధిష్టానం సిద్ధం అయినట్లు సమాచారం. ఆమె కూతురు చేసిన వ్యాఖ్యలు సురేఖ మెడకు చుట్టుకునేలా కనిపిస్తున్నాయి. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు మహేశ్​ కుమార్​ గౌడ్ (PCC Chief)​ కీలక వ్యాఖ్యలు చేశారు.

గాంధీ భవన్ (Gandhi Bhavan)​లో శనివారం కాంగ్రెస్​ క్రమశిక్షణ కమిటీ సమావేశం అయింది. అనంతరం పీసీసీ చీఫ్​ మహేశ్​ గౌడ్​ మీడియా చిట్​చాట్​లో మాట్లాడారు. మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత (Konda Susmitha) లైన్ దాటి ఆరోపణలు చేశారన్నారు. కానీ ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి, అనిరుద్ రెడ్డి లైన్ దాటలేదని ఆయన పేర్కొన్నారు. పార్టీ లైన్ ఎవరు మాట్లాడినా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కొండా సురేఖను గతంలో కాపాడామని, ఇప్పుడు ఆ అవకాశం లేదన్నారు. ఆమెపై అధిష్టానం సీరియస్‌గా ఉందన్నారు.

Konda Surekha | ఏకమైన ఎమ్మెల్యేలు

కొండా సురేఖ వ్యవహారం ఆది నుంచి పార్టీకి తలనొప్పిగా మారింది. గతంలో ఆమె కేటీఆర్​ గురించి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అనంతరం సురేఖ భర్త కొండా మురళి పరకాల ఎమ్మెల్యే రేవూరి, స్టేషన్​ ఘన్​పూర్​ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. స్వయంగా కొండా సురేఖ సైతం ఎమ్మెల్యే నాయిని రాజేందర్​రెడ్డిపై విమర్శలు చేశారు. దీంతో కొండా ఫ్యామిలీకి వ్యతిరేకంగా ఉమ్మడి వరంగల్​ జిల్లా ఎమ్మెల్యేలు ఏకం అయ్యారు.

Konda Surekha | అధిష్టానం సూచనలతో..

విభేదాలు పక్కన పెట్టాలని పార్టీ అధిష్టానం సూచించడంతో కొంతకాలంగా కొండా సురేఖ, మురళి సైలెంట్​ అయ్యారు. అయితే ఇటీవల ఆమె కూతురు నేరుగా సీఎం రేవంత్​రెడ్డిపై విమర్శలు చేయడంతో పార్టీ సీరియస్​గా తీసుకుంది. ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేయగా.. పలువురు ఎమ్మెల్యేలు సమావేశమై సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించాలని తీర్మానం చేశారు. ఈ క్రమంలో ఆమెను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.

దీనిని కూడా చదవండి : Cannabis Trafficking | అనుమానం రాకుండా.. వృద్ధులతో గంజాయి రవాణా

 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *