Noida Bus Fire | బస్సు ప్రమాదం.. 9 మంది సజీవ దహనం

ఉత్తరప్రదేశ్​లోని నోయిడాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Noida Bus Fire | ఉత్తరప్రదేశ్​లోని నోయిడాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై బుధవారం అర్ధరాత్రి ఓ స్లిపర్​ బస్సులో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 9 మంది సజీవ దహనం అయ్యారు.

ఏసీ బస్సు నోయిడా నుంచి ఉత్తరప్రదేశ్​ (Uttar Pradesh)లోని మహోబాకు వెళ్తుండగా అర్ధరాత్రి ప్రమాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. ఏసీ పేలడంతో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు ఇంజిన్ లూబ్రికేటింగ్ ఆయిల్‌కు అంటుకొని వేగంగా వ్యాపించాయి. దీంతో బస్సు కాలిబూడిద అయింది. ఆ సమయంలో ప్రయాణికులు నిద్రలో ఉన్నారు. దీంతో 9 మంది సజీవ దహనం అయ్యారు. పలువురు ప్రయాణికులు కిటికీల ద్వారా బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు.

Noida Bus Fire | పరిహారం ప్రకటించిన ప్రభుత్వం

సమాచారం అందుకున్న వెంటనే, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ. 50,000 చొప్పున పరిహారం ఇస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పరిస్థితిని సమీక్షించారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం ఇస్తామన్నారు.

ఇది కూడా చదవండి..: BJP State Incharges | బీజేపీలో భారీ ప్రక్షాళన.. యూపీ సహా వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌చార్జ్‌లు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *