అక్షరటుడే, వెబ్డెస్క్: Karamtara Engineering IPO | కరమ్తారా ఇంజినీరింగ్ అనేది పునరుత్పాదక శక్తి మరియు ట్రాన్స్‌మిషన్ లైన్ రంగాలకు పరిష్కారాలను అందించడంలో తన నైపుణ్యానికి ప్రసిద్ధి చెందిన ఒక బ్యాక్‌వర్డ్-ఇంటిగ్రేటెడ్ తయారీ సంస్థ. దీని ఉత్పత్తి శ్రేణిలో సోలార్ స్ట్రక్చర్‌లు (ఫిక్స్‌డ్ టిల్ట్ మరియు ట్రాకర్‌లు), సౌరశక్తి కోసం ఫాస్టనర్‌లు, సోలార్, విండ్, ట్రాన్స్‌మిషన్, ఆటోమొబైల్, టెలికాం వంటి అనేక రకాల పరిశ్రమల కోసం ట్రాన్స్‌మిషన్ లైన్‌లు ఉన్నాయి.
Karamtara Engineering IPO | 50కి పైగా దేశాలకు ఎగుమతులు..
సోలార్ మౌంటింగ్ స్ట్రక్చర్‌లు మరియు ట్రాకర్ కాంపోనెంట్‌లను తయారు చేసే అతిపెద్ద తయారీదారులలో కరమ్తారా ఇంజినీరింగ్ కంపెనీ ఒకటి. ఈ సంస్థకు అంతర్జాతీయ ఉనికి ఉంది. ఇది ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, మరియు లాటిన్ అమెరికాలోని 50కి పైగా దేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది.
Karamtara Engineering IPO | ఐపీవో సైజ్..
కంపెనీ ఐపీవో (IPO) ద్వారా రూ. 875 కోట్లు సమీకరించనుంది. ఇందులో రూ. 675 కోట్లు ఫ్రెష్ ఇష్యూ.. ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ప్రమోటర్లు రూ. 10 ముఖ విలువ కలిగిన 78,74,014 ఈక్విటీ షేర్లను విక్రయించి రూ. 200 కోట్లు పొందనున్నారు. ఐపీవో ద్వారా సమకూరిన నిధులను రుణాల చెల్లింపు, సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం వినియోగించనున్నారు.
ప్రైస్ బ్యాండ్ : కంపెనీ ఒక్కో ఈక్విటీ షేరు ధరను రూ.241 నుండి రూ.254 గా నిర్ణయించింది. ఒక లాట్‌లో 59 షేర్లున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్ కోసం గరిష్ట ప్రైస్ బ్యాండ్ వద్ద రూ. 14,986తో దరఖాస్తు చేసుకోవాలి. గరిష్టంగా 13 బిడ్లు దాఖలు చేయవచ్చు.
కోటా : క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయర్స్ (క్యూఐబీ)కు 50 శాతం, నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ (ఎన్ఐఐ)కు 15 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం కోటా కేటాయించారు.
జీఎంపీ : గ్రే మార్కెట్‌లో రెంటోమోజో షేర్లకు డిమాండ్ ఉంది. ఒక్కో షేరు జీఎంపీ రూ. 68 ఉంది. అంటే ఐపీవో అలాట్ అయినవారికి 26 శాతం లిస్టింగ్ గెయిన్స్ వచ్చే అవకాశాలున్నాయి.
ఇది కూడా చదవండి..: RentoMojo IPO | ఐపీవోకు ఫర్నిచర్ అద్దె కంపెనీ..