అక్షరటుడే, వెబ్‌డెస్క్: Aug 20 Market Analysis | జియో పొలిటికల్ టెన్షన్స్(Geo political tensions) కొనసాగుతున్నా గురువారం గ్లోబల్ మార్కెట్లు లాభాల బాటలో పయనిస్తున్నాయి.
గత సెషన్‌లో వాల్‌స్ట్రీట్ లాభాలతో ముగియగా.. గురువారం ఉదయం ఆసియా Asia మార్కెట్లూ దానిని అనుసరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్ బెంచ్‌మార్క్ సూచీలైన సెన్సెక్స్(Sensex), నిఫ్టీ లాభాలతో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
Aug 20 Market Analysis | యూఎస్ మార్కెట్లు..
వాల్‌స్ట్రీట్‌లో 3 సెషన్‌ల నష్టాలకు బ్రేక్ పడింది. గత సెషన్‌లో నాస్‌డాక్ 0.16 శాతం, ఎస్ అండ్ పీ 0.21 శాతం లాభపడగా.. గురువారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.01 శాతం నష్టంతో ఉంది.
Harish Rao Letter Section 22A | 22A ల్యాండ్ కుంభకోణంపై హరీశ్ రావు ఫైర్..రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ
Aug 20 Market Analysis | యూరోప్ మార్కెట్లు..
యూకేకు చెందిన ఎఫ్టీఎస్ ఈ 0.14 శాతం లాభంతో, జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.14 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.09 శాతం నష్టపోయాయి.
Aug 20 Market Analysis | ఆసియా మార్కెట్లు..
ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 8 గంటల ప్రాంతంలో సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 5.71 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.93 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.53 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.30 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.14 శాతం లాభంతో.. సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.68 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.59 శాతం లాభంతో ఉండడంతో మన మార్కెట్లు పాజిటివ్ గా ప్రారంభం కానున్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు గత సెషన్‌లో నికరంగా రూ. 407 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
- డీఐఐలు గత సెషన్‌లో నికరంగా రూ. 3,973 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 7 పైసలు బలహీనపడి 95.76 వద్ద ఉంది.
- క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 91.94 డాలర్ల వద్ద ఉంది.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 0.93 నుంచి 0.81 కి తగ్గింది.
- విక్స్ 0.57 శాతం పెరిగి 11.32 వద్ద ఉంది.
- యూఎస్ డాలర్ ఇండెక్స్ 99.63 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.64 వద్ద ఉన్నాయి.
- సెన్సెక్స్ డెరివేటివ్స్ వీక్లీ ఎక్స్‌పైరీ నేపథ్యంలో మార్కెట్‌లో ఒడుదుడుకులు ఉండే అవకాశాలున్నాయి.