Seethakka Banswada Visit | బాన్సువాడలో మంత్రి సీతక్క పర్యటనపై పోచారం సమీక్ష

పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఉమ్మడి నిజామాబాద్ ఇన్​ఛార్జి మంత్రి సీతక్క మంగళవారం బాన్సువాడకు రానున్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, బాన్సువాడ: Seethakka Banswada Visit | బాన్సువాడ (Banswada) మండలంలో మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఉమ్మడి నిజామాబాద్ ఇన్​ఛార్జి మంత్రి సీతక్క రానున్నారు.   పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, నూతన భవనాల ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు.

విజయవంతం చేసేందుకు..

మంత్రి పర్యటన ఏర్పాట్లపై ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ప్రజాప్రతినిధులు, నాయకులతో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. పర్యటనలో భాగంగా మంత్రి మధ్యాహ్నం 2 గంటలకు కొయ్యగుట్ట తండాలో నూతన గ్రామ పంచాయతీ భవనం, మహిళా సమాఖ్య భవనాల నిర్మాణాలకు భూమిపూజ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు పట్టణంలోని 3వ వార్డులో నూతనంగా నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3.30కు బోర్లం గ్రామ శివారులో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభిస్తారు. మంత్రి పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లను ప్రజాప్రతినిధులు, నాయకులు సమన్వయంతో చేపట్టి కార్యక్రమాలను విజయవంతం చేయాలని పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆగ్రోస్ మాజీ ఛైర్మన్ కాసుల బాలరాజు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Benson Raju Appointment | సేవాదళ్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా సంధి బెన్సన్ రాజు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *