అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market Crash | అమెరికా -ఇరాన్ ల మధ్య శాంతి ఒప్పందం విషయంలో అనిశ్చితి కొనసాగుతుండడం, హార్మూజ్ జలసంధిపై దిగ్బంధనం కొనసాగుతుండడంతో ముడి చమురు ధరలకు రెక్కలొచ్చాయి.
క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధర పెరుగుతుండడంతోపాటు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు పెట్టుబడులను ఉపసంహరిస్తూనే ఉండడంతో రూపాయి విలువ రోజురోజుకు బలహీనపడుతోంది. దీంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. గరిష్టాల వద్ద అమ్మకాలకు పాల్పడుతుండడంతో దేశీయ స్టాక్ మార్కెట్ తీవ్ర ఒత్తిడికి గురవుతోంది.
Stock Market Crash | రూ. 7 లక్షల కోట్లకుపైనే నష్టం..
దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market)లో బెంచ్ మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ బుధవారం నుంచి వరుసగా పతనమవుతున్నాయి. 3 రోజుల్లో సెన్సెక్స్ 2,609 పాయింట్లు కోల్పోగా, నిఫ్టీ 679 పాయింట్లు పడిపోయింది. అంటే సెన్సెక్స్ 3.3 శాతం, నిఫ్టీ 50 ఇండెక్స్ 2.8 శాతం క్షీణించాయి. ఇన్వెస్టర్లు రూ. 7 లక్షల కోట్లకుపైనే నష్టపోయారు.
Stock Market Crash | పడేసిన ఐటీ..
దేశీయ స్టాక్ మార్కెట్లో బెంచ్ మార్క్ సూచీలను ఐటీ రంగం పడేసింది. నిఫ్టీ (Nifty) ఐటీ ఇండెక్స్ ఈ వారంలోనే పది శాతానికిపైగా క్షీణించింది. హెచ్ సీఎల్ టెక్ 15.76 శాతం, ఇన్ఫోసిస్ 12.04 శాతం, టెక్ మహీంద్రా 9.70 శాతం, టీసీఎస్ 7.08 శాతం నష్టపోయాయి. దీని ప్రభావం ప్రధాన సూచీలపై కనిపించింది.
Stock Market Crash | రూపాయిలో బలహీనత..
ముడి చమురు ధరలు వారంలో సుమారు 18 శాతం పెరిగాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ మరోసారి రూ. 94 దిగువకు పడిపోయింది. చివరి సెషన్లో 94.25 వద్ద ముగిసింది. ఇది మార్కెట్ సెంటిమెంట్‌పై ఒత్తిడిని పెంచుతోంది.

Stock Market Crash | కొనసాగిన పెట్టుబడుల ఉపసంహరణ
ఎఫ్ఐఐలు ఈ వారంలోనూ నికర అమ్మకందారులుగా నిలిచారు. ఈనెల 20న నికరంగా రూ. 1,060 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన ఎఫ్ఐఐలు.. 21న రూ. 1,918 కోట్లు, 22న రూ. 2,078 కోట్లు, 23న రూ. 3,254 కోట్లు, 24న రూ. 8,828 కోట్ల విలువైన స్టాక్స్ అమ్మారు. అంటే ఫారిన్ ఇన్వెస్టర్లు ఈ వారంలో నికరంగా రూ. 17,138 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించారు. దీంతో మార్కెట్ తీవ్ర ఒత్తిడికి గురయ్యింది. దీంతో ఇన్వెస్టర్లు భారీగా నష్టపోవాల్సి వచ్చింది.
ఇది కూడా చదవండి..: April 25 Gold Rates | పెళ్లిళ్ల సీజన్లో గుడ్ న్యూస్ .. పడిపోతున్న బంగారం ధర.. కొనుగోలుదారులకు ఊరట!

