అక్షరటుడే, వెబ్డెస్క్: Diwali Eye Injuries | రాష్ట్రవ్యాప్తంగా దీపావళి వేడుకలను ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. చిన్నా పెద్ద తేడా లేకుండా ఉత్సాహంగా టపాసులు కాల్చారు. అయితే పటాకులు కాల్చే సమయంలో పలువురు గాయపడ్డారు.
హైదరాబాద్ (Hyderabad) నగరంలో పటాకుల వల్ల 32 మంది కంటి గాయాలకు గురవగా, వారిలో ఒకరు కంటిచూపు కోల్పోయినట్లు సమాచారం. నగరవ్యాప్తంగా పలుచోట్ల అగ్నిప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి. క్రాకర్స్ కాలుస్తున్న సమయంలో చాలా మంది కంటికి గాయాలు అయ్యాయి.
Diwali Eye Injuries | సరోజిని దేవి ఆస్పత్రికి..
కంటికి గాయాలు అయిన వారు మెహదీపట్నంలోని సరోజిని దేవి ఐ హాస్పిటల్కు పరుగులు తీశారు. సోమవారం ఉదయం 10 గంటల వరకు దాదాపు 73 మంది బాధితులు ఆస్పత్రికి వచ్చారు. అందులో 13 మంది తీవ్ర గాయాలతో అడ్మిట్ అయినట్టు ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. ఇందులో 17 మంది చిన్నారులు ఉన్నారు. మిగతా వారికి చికిత్స చేసి వెంటనే ఇంటికి పంపించారు. కాగా ఈ రోజు మరింత మంది ఆస్పత్రికి వచ్చే అవకాశం ఉంది. కాగా దీపావళి సందర్భంగా గాయాలు అయిన వారి కోసం జిల్లాల్లో సైతం ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు.
ఇది కూడా చదవండి..: Hyderabad Fire Accident | హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం